జగన్... మీరు ఈ వీడియో చూశాకైనా మారండి

June 03, 2020

ఏపీలో ఎవరికి స్వేచ్ఛ ఉందయ్యా అంటే... సారా దుకాణాలకు మాత్రమే ఉందని చెప్పొచ్చు. తెలంగాణలో కొంచెం ఇబ్బందులున్నా రైతులు పంటలు కచ్చితంగా కొంటాం అని ఘంటాపథకంగా ముఖ్యమంత్రి చెప్పడంతో సమస్య చాలావరకు పరిష్కారమైంది. రైతుల్లో ఆందోళన తగ్గింది.  కానీ ఏపీలో పరిస్థితి వేరేగా ఉంది. 

పంట పండించిన రైతుకు భరోసా లేదు. కరోనా వ్యాప్తికి కారణమయ్యేలా వైసీపీ నేతలు సభలు పెట్టుకోవడానికి అనుమతి దొరుకుతోంది గాని రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి వారికి స్వేచ్ఛ ఉండటం లేదు. రకరకాల నిబంధనల పేరు చెప్పి సర్కారు వారిని ఇబ్బంది పెడుతోంది. దీంతో లక్షలాది ఎకరాల పంట నాశనమవుతోంది. ఆహారం లేకపోతే ఏం తిని బతుకుతాం? అన్న జ్జానం కూడా లేకుండా ప్రవర్తిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులకు జగన్ హయాంలో చాలా కష్టాలు వచ్చాయని అంటున్నారు.

తాజాగా చంద్రబాబు రైతులు ఏపీలో ఎంత ఇబ్బందులు పడుతాన్నరో ఒక వీడియో షేర్ చేశారు. ఎంత కస్టమైనా వ్యవసాయం చేస్తున్న రైతు కు ప్రభుత్వ సహకారం అందటం లేదని తాజా వీడియోలో అర్థమవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ చంద్రబాబు ఏమన్నారంటే... ’’తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?‘‘ ముఖ్యమంత్రిని నిలదీశారు. జగన్ ప్రభుత్వం హోప్ లెస్ గా మారిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు షేర్ చేసిన రైతు వీడియో ఇదే. 

 

సీఎం జగన్ సొంత జిల్లాలో పంట అమ్ముకునే పరిస్థితులు లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో పంటను రోడ్డు మీద పారబోస్తున్న రైతులు.