పులివెందుల అరాచకం తట్టుకోలేక... మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యయత్నం

July 06, 2020

రాజన్న రాజ్యం...తెస్తాం అంటే జనం దాని నిర్వచనం ఏంటో అడగకుండా ఓట్లేశారు. చివరకు మీనింగ్ తెలిశాక ఏం చేయాలో దిక్కుతోచక జుట్టుపీక్కుంటున్నారు. కాల్ మనీ అనేది గతంలో ఎవరో కొందరు సామాన్యులను వేధిస్తేనే... అంతా తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టు జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకం కొనసాగుతోందని విమర్శలు చేశారు. కానీ ఇపుడు ఏకంగా బడా నేతలను కూడా బెదిరిస్తున్నారు. కారణం అదే కాల్ మనీ. ఇపుడు మాజీ ఎమ్మెల్యే బాధితుడు. ఒక మాజీ ఎమ్మెల్యను బెదిరిస్తున్నారు అంటే వారికి ఎవరి అండ ఉంటుందో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. 

ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతి భద్రతలకు ఏం ఢోకా లేదన్నారు. కట్ చేస్తే కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నరామయ్యను కాల్ మనీ మాఫియా వేధింపులకు గురిచేసింది. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే... వాటిని తట్టుకోలేక ఆయన ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. సీన్ ఏంటంటే... ఈ కాల్ మనీ పులివెందులకు చెందిన వారని తెలిసింది. అంటే... వారి టార్గెట్ ఏంటో, వారు ఎవరో ఇట్టే పసిగట్టొచ్చని సోషల్ మీడియా చర్చిస్తోంది. 

రామయ్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కుటుంబ సభ్యులు ఆయనతో కలిసి ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. డీజీపీ నుంచి వారికి ఎలాంటి రక్షణ లభిస్తుందో చూడాలి.