మెగాస్టార్ అల్లుడి గురించి కొత్త అప్ డేట్

August 15, 2020

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం రెడీ అయ్యాడు. గతంలో విజేత సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రెండో ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాతో సినీ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడి అవతారమెత్తనున్నాడు.
జీఏ2 పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తాను సిద్ధం చేసుకున్న కథకు కళ్యాణ్ దేవ్ సరిగ్గా సెట్ అవుతాడని భావించి ఈ సినిమాలో అతన్నే హీరోగా తీసుకున్నామని చెప్పాడు డైరెక్టర్ శ్రీధర్ సీపాన. ప్రేమకథతో కూడిన వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు.
మార్చి నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించి చకచకా ఫినిష్ చేయనుందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. చూడాలి మరి ఈ సినిమాతో అయినా మెగాస్టార్ అల్లుడు ట్రాక్ ఎక్కుతాడా? లేదా? అనేది.