ఓట్ల కోసం బరితెగించిన కమల్

July 08, 2020

స్వంతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూయే.... ఇది కమల్ హాసన్ తాజాగా చేసిన వివాదాస్పద కామెంట్. ఒక ఉన్మాదానికి, ఉగ్రవాదానికి కమల్ హాసన్ తేడా తెలుసుకోకపోవడమే విచిత్రం. మత ఉన్మాదంతో తన మతానికి నష్టం చేశాడన్న అక్కసుతో గాంధీని చంపిన వాడు నాథూరామ్ గాడ్సే. తన మతం తప్ప ఇతర మతాలు బతకకూడదు అని ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తూ సంబంధం లేని వారిని అమయాకులను చంపేవాడు ఉగ్రవాది. ఈ రెండింటికి తేడా తెలియకుండా కమల్ హాసన్ ఈ దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అని, అప్పట్నుంచే ఉగ్రవాదం మొదలైందని వ్యాఖ్యానించడం చాలామందిని గాయపరిచింది.
ఇదిలా ఉండగా... కమల్ చేసిన ఈ కామెంట్లు ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కావడం ఆయన మీద అందరికీ కోపాన్నితెప్పించింది. కేవలం ఓట్ల కోసం ఇలా రెండు మతాల మధ్య చిచ్చు పెడతావా కమల్ అంటూ అందరూ కమల్ పై మాటల దాడికి దిగారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్ అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో తన అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడ ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను మొట్టమొదటి భారత ఉగ్రవాదిగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గంలో కమల్ పార్టీ అభ్యర్థిగా మోహన్ రాజ్ బరిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడు రాజకీయ విప్లవం అంచులో ఉందని పాలక అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేకు వ్యతిరేకంగా విప్లవం రానుందన్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని.. మా పార్టీ ప్రజల పట్ల బాధ్యతగా ఉంటుందని కమల్ అన్నారు.