అమరావతి భూములు గుట్టు విప్పిన  RRR

August 07, 2020

నిజం ఎవరూ మార్చలేరు.

నిజం ఎన్నటికీ మారదు. 

కానీ ఒక్కరు నిజం చెబుతున్నపుడు, చుట్టూ ఉన్న వెయ్యి మంది దానిని అబద్ధం అంటే కచ్చితంగా అనుమానం వస్తుంది.

ఈ సందర్భంలో సాధారణంగా జనం మెజారిటీ మాటే వింటారు.

ఎందుకంటే... ఎక్కువ మంది చెప్పేది నిజమనిపిస్తుంది

కానీ ఎంత మంది చెప్పినా నిజం మాత్రం అబద్ధం కాదు, అబద్ధం ఎన్నటికీ నిజమైపోదు.

అమరావతి విషయంలో జరిగింది ఇదే. అమరావతిని కమ్మ రాజధాని చేసేశారు. నిజానికి అమరావతి కమ్మవారి ప్రాంతమే అయితే మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉండదు. అయినా పదేపదే అబద్ధాన్ని చెప్పి అమరావతిపై కమ్మ ముద్ర వేశారు. దీనిని పటాపంచలు చేస్తూ వైసీపీ అరాచకాల గుట్టు విప్పిన నరసాపురం ఎంపీ రఘురామరాజు అమరావతి గుట్టును విప్పేశారు.

తాజాగా వైసీపీ ప్రభుత్వం తీరుపై, బెదిరింపులపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి రఘురామరాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే ఉండాలి, ప్రతి ఒక్కరూ పోరాటం చేసి అమరావతి నుంచి రాజధాని వెళ్లకుండా చేయాలని  పిలుపునిచ్చారు.  భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని అన్నారు.  ప్రత్యక్షంగా పార్టీపై ఒక్క విమర్శ కూడా చేయకపోయినా ప్రభుత్వం అరాచకాలపై విరుచుకుపడ్డారు. 

వైసీపీ పార్టీ ఒరిజనల్ రూపం కోల్పోయిందని, ప్రస్తుతం పార్టీ తప్పుదోవలో నడుస్తోందని ఆయన అన్నారు. మొదట్నుంచి ప్రభుత్వం తప్పులు చెప్పి సరిచేసుకోమని సూచనలే ఇస్తున్నా, సూచనలు ఇవ్వడం తప్పు కాదు - అలా చేసినందుకు నాపై పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి పీఎస్‍లో కేసులు పెట్టించారు అని అన్నారు. అమరావతికి కూడా ఇలాగే అన్యాయం చేశారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని సీఎంకు వివరించే ప్రయత్నం చేద్దాం - అమరావతి విషయంలో కులాలకు అతీతంగా వెళ్లాలి అని పిలుపునిచ్చారు. 

అమరావతిలో కమ్మ కులస్తులు ఇచ్చిన భూములు 18 శాతమే, కానీ 82 శాతం భూమలు రెడ్లు, ఇతర బడుగు బలహీనవర్గాలవి. కమ్మకులస్థుల కంటే రెడ్డికులం వారే 23 శాతం భూములిచ్చారు. 35 శాతం భూములు ఎస్సీ, ఎస్టీలు ఇచ్చారు అని ఎంపీ రఘురామకృష్ణరాజు బయటపెట్టారు.

ఇంతకాలం వైసీపీ 70 శాతం భూములు కమ్మవాళ్లవి అంటూ అబద్ధాలు ప్రచారం చేసింది. వాటిని రామరాజు బయటపెట్టి వైసీపీ పరువు తీశారు.