అమరావతి గురించి వైసీపీ చెప్పింది అబద్ధమా?

February 21, 2020

రాజకీయ పార్టీలు రాజకీయం చేయడంలో తప్పులేదు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తమను జనాలు నమ్మడానికి రచించిన వ్యూహాలన్నీ మోసపూరితంగా, అబద్ధాలతో నిండిఉన్నాయని ఇపుడు తెలిసివస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ.. రాజధానిలో ఒక సామాజిక వర్గం... కమ్మ వారి డామినేషన్ ఉందని వ్యూహాత్మకంగా వైసీపీ చేసిన సుదీర్ఘ ప్రచారమే. 

తెలుగుదేశం పార్టీపై కులం వల పన్నారు జగన్, వి.సా.రెడ్డిలు. వాస్తవానికి తెలుగుదేశంలో పార్టీ పదవుల్లో ఉన్న వారి కులాలను వైసీపీ పార్టీ పదవుల్లో ఉన్న వారి కులాలతో కంపేర్ చేసి చూసినపుడు వైసీపీలో ఎక్కువ కులాభిమానం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సరే పార్టీపై కుల ముద్ర వేశారంటే అదిరాజకీయం అని వదిలేయొచ్చు. కానీ ఏకంగా రాజధానిపై కులముద్ర వేశారు. వాస్తవం వేరు. వీరు చెప్పింది వేరు. అమరావతి రాజధాని పరిధిలో అత్యధికులు రెడ్డి కులస్థులు. 17 శాతం ఉన్నారు. కమ్మ వారు కేవలం 14 శాతం మాత్రమే ఉన్నారు. మిగతా కులాలు 69 శాతం. కానీ వైసీపీ చేసిన దుష్ప్రచారం వల్ల అమరావతిలో మొత్తం కమ్మోళ్లే ఉన్నట్లు జనాలు భావిస్తున్నారు. ఈ విధంగా కమ్మకులం పై జనాల్లో ద్వేషం పెంచి దాంతో వైసీపీ పబ్బం గడుపుకుంది. 

అమరావతి గురించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ ప్రచారం నమ్మడం వల్లే కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు వారి ప్రాంతంలో రాజధాని పెట్టినా తెలుగుదేశం పార్టీని నమ్మలేదు. ఈరోజు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. రాజధాని మారిస్తే... ఇపుడు నష్టపోయిేది ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కాదు... చంద్రబాబు వద్దు మాకు జగన్ కావాలని ఓటేసిన ఈ రెండు జిల్లాల ప్రజలంతూ తీవ్ర పశ్చాత్తాపం చెందే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా... అమరావతి మొత్తం కమ్మలే ఉన్నారని నమ్మించడంలో వైసీపీ వ్యూహం బ్రహ్మాండంగా ఫలించింది. దానిని నమ్మిన ఆ ప్రాంత ప్రజలకు మాత్రం భారీ నష్టం తప్పడం లేదు.