చంద్రబాబు పీఠమెక్కితే... ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి మరి

August 05, 2020

ఏమాటకు ఆమాట. చంద్రబాబుకు అభివృద్ధి, పురోగతిపై మక్కువ ఎక్కువ. ఏదైనా శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేయాలనుకుంటారు. కానీ చేసిన పనుల్లో చెప్పుకోవాల్సినవి వదిలేసి మిగతావన్నీ చెబుతుంటారు. ఉదాహరణకు దళారీల చేతిలో చితికిపోతున్న రైతుకు రైతు బజార్లు పెట్టడం ద్వారా కాసుల వర్షం కురిపించాడు. కానీ ఎపుడూ ఆ హైటెక్ సిటీ గురించి చెప్పుకుంటుంటాడు. ఆ హైటెక్ సిటీకి వెళ్లిన వాడు అట్నుంచి అటే అమెరికాకు పోతాడు. ఓటు వేయడు. రైతు బజారుకు పోయిన వాడికి బాబూ ఇది నా కష్టమేరా అని చెప్పడు. అందువల్ల ఇతను ఓటు వేయడు. చంద్రబాబు వ్యవహారం అంతా ఇలాగే ఉంటుంది.

కాలవలకు నీళ్లిచ్చిన దానికంటే అమరావతి గురించి చెబుతాడు. రోడ్డు పడ్డన కుటుంబాన్ని ఆదుకున్న చంద్రన్న బీమా గురించి చెప్పమంటే గన్నవరం ఎయిర్ పోర్టు గురించి చెబుతాడు. అన్నీ బాబు పనులే... కానీ ఏ మాట చెబితే జనం తనను ప్రేమిస్తారో అన్న విషయం చంద్రబాబు గుర్తించే సమయానికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. 

ఇదిగో ఓట్లు రాల్చని అద్భుతాలు మాత్రం ఇలా చంద్రబాబును గుర్తుచేస్తూనే ఉంటాయి. ఇది విజయవాడలో కట్టిన 2.3 కిలోమీటర్ల కనక దుర్గ ఫ్లై ఓవరు. 5.29 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ఫ్లై ఓవరు పోను మిగతాది రోడ్డు వైడెనింగ్ అండ్ డెవలప్ మెంట్. మొత్తం ప్రాజెక్టు విలువ 440 కోట్లు. దుర్గమ్మ తల్లి కోవెలకు అలంకరించిన నెక్లెస్ లా భలే ఉంది కదా.  

 Image