జగన్ సూపర్ గేమ్... రెడ్డి కాదు గానీ...

June 03, 2020

చూశారా మీరు అనవసరంగా జగన్ మీద నిందలు వేస్తారు... జగన్ కే కనుక కులపిచ్చి ఉంటే రెడ్డిని ఎలక్షన్ కమిషనర్ ని చేసేవాడుగా అని వైసీపీ వాళ్లు, అవును జగనేంటి... రెడ్డిని పెడతాడు అనుకుంటే ఎవరికీ తెలియని మంచి ట్రాక్ రికార్డు ఉన్నోడిని పట్టుకువచ్చాడు ఇపుడెలా అని ప్రతిపక్షాలు భ్రమపడుతున్నాయి. వాస్తవం తెలిస్తే దిమ్మ తిరుగుతుంది. జగన్ చాలా తెలివిగా ఏపీ ప్రజలను డైవర్ట్ చేశాడు. 

కనగరాజు... జగన్ కి కావల్సిన మనిషి అని తెలుసుకోవడానికి ముందు రెండు ప్రశ్నలు.

జగన్ ది ఏ మతం ?

క్రిస్టియానిటీ .

మరి జగన్ ఏ కులాన్ని పాటిస్తున్నాడు

రెడ్డి కులం. 

(ఒక మనిషికి రెండు మతాలు సాధ్యం కాదు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏపీలో అత్యధికంగా ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకు కోసం జగన్ ఆ మతాన్ని, రెడ్డి ఓటు బ్యాంకు కోసం ఈ కులాన్ని వాడుకుంటారు. జగన్ రెడ్డి అయితే క్రిస్టియన్ కానట్టు. క్రిస్టియన్ అయితే రెడ్డి కానట్టు.) 

 

ఈ రెండు నిజమే కదా. ఇపుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ముందు చూపుతో ఏపీ ప్రజల క్షేమం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశాడు. ప్రతి మనిషికి ఒక కులం ఉంటుంది. అలాంటపుడు కులం చూపి అతను తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టలేం. అయితే పొరపాటున జగన్ ఫ్రస్ట్రేషన్లో కమ్మ కులం కాబట్టే నిమ్మగడ్డ ఇలా చేశాడు అని బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేశారు .ఇది బూమ్ రాంగ్ అయింది. అందుకే ఎన్నికల కమిషనర్ తొలగించాలి. ఆ స్థానంలో రెడ్డిని నియమిస్తారు అని అందరూ ఊహించాలి. ( ఆ క్రమంలోనే వైసీపీ వాళ్లే సుందర్ రెడ్డి అని ఉత్తుత్తి ప్రచారం చేశారు) సడెన్ గా రెడ్డి కాని వ్యక్తిని నియమించాలి. తద్వారా ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో జరిగిన కులారోపణ డ్యామేజ్ ని తగ్గించుకోవాలని జగన్ వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా మద్రాస్ హైకర్టు జడ్జిగా పనిచేసిన తమిళుడిని తెచ్చి కమిషనర్ ని చేశారు. ఆయన ఎక్కడున్నాడో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు. ప్లైట్లు లేవు. కానీ ఉదయానికి అమరావతిలో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే ట్విస్టు. 

కనగరాజ్ నియమాకం ఆంతరంగికంగా ఎపుడో జరిగిపోయింది. నిన్న కేవలం టెక్నికల్ ప్రాసెస్ పూర్తయ్యింది. ఇతనిది జగన్ కులం కాదు. కానీ జగన్ మతం అని చెబుతున్నారు. బ్రదర్ అనిల్ కి కనగరాజ్ కి పరిచయం ఉందట. కనగరాజ్ చెన్నైలోని క్రిస్టియన్ మైనారిటీ కాలేజీ ఛైర్మన్ గా పనిచేస్తుండటం గమనార్హం. ఇపుడు కూడా ఆయనే ఛైర్మన్. ఎపుడో రిటైరైన 84 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా ఏ పరిచయం లేకుండా ప్రభుత్వం వెతికి వెతికి ఎలా పట్టుకువచ్చింది. తెలంగాణలో, ఏపీలో కర్ణాటకలో ఎంతో మంది రిటైర్డ్ జడ్జిలు ఉండగా... ఈయననే ఎందుకు ఎంపిక చేశారో అర్థమైందిగా. 

కింది ఫొటో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది !