నిజంగా ఆ పనిచేస్తే జగన్ కి సారీ చెబుతా !!

June 03, 2020
CTYPE html>
వైసీపీ రాజకీయం ఏంటో బీజేపీకి బాగా అవగతం అయినట్టుంది. జగన్ చెప్పేవన్నీ పబ్లిసిటీ కోసమే అని... ఏం చేసినా అది పార్టీకోసమేనా బీజేపీకి అర్థమైంది. 9 నెలల్లోనే జగన్ తో ప్రెండ్షిప్ బీజేపీకి ప్రమాదమని అర్థమైనట్టు కనిపిస్తోంది. మద్యం డబ్బు పంచకూడదు అంటూ జగన్ తెచ్చిన చట్టంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. ఈ ఆర్డినెన్స్ చట్టం ప్రతిపక్షాలను భయపెట్టడానికే జగన్ తీసుకువచ్చారని అన్నారు. అయినా ఒక మాట చెబుతున్నాను అంటూ వైసీపీకి ఒక సవాల్ విసిరారు. 
వైసీపీ కనుక ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా గెలిస్తే... ఎన్నికల తర్వాత తాను జగన్ కి సారీ చెప్పడానికి సిద్ధమని అన్నారు. వైసీపీ నేతలు మద్యం డబ్బు వాడకుండా ఎన్నికలు వెళ్లడానికి సవాల్ స్వీకరించాలన్నారు. జగన్ కి చిత్తశుద్ధి ఉంటే తాను తెచ్చిన చట్టం తన పార్టీ విషయంలో కఠినంగా అమలు చేయాలన్నారు. నిజంగా జగన్ కనుక అలా చేస్తే... తాను ఇపుడు అన్నమాటలు తప్పు అని ఒప్పుకుని జగన్ కు సారీ చెబుతాను అని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు.