జగన్ అరాచకాలపై బీజేపీ నేతల నోటితో వింటే ఆ కిక్కే వేరు

June 06, 2020

చంద్రబాబు ఓటమి భయంతో బీజేపీ శత్రువు అయ్యాడు. దానికి ఒక కారణమూ ఉంది. రాజధాని, పోలవరం విషయంలో బీజేపీ మోసం చేసింది. వారితో కలిసున్న టీడీపీకి ఆ పాపం అంటింది. మా తప్పు లేకుండా మేము బలవుతున్నాం అని బీజేపీ టీడీపీ దూరం జరిగింది. మొదట్లో చంద్రబాబు ఏమీ అనేవారు కాదు. దూరం జరిగిన సైలెంటుగానే ఉన్నారు. కానీ జీవీఎల్, విష్ణుకుమార్ రాజు వంటి వారిని ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ కొనేసి రెచ్చగొట్టారు. అదే సమయంలో విజయసాయిరెడ్డిని కేంద్రంలో మోడీకి నిరంతరం నమస్తే పెట్టే బాధ్యతలతో ఢిల్లీలో ఉంచారు. తనను స్థానిక నేతలు తిడుతూ ఉన్నా... బీజేపీ కేంద్ర శాఖ పట్టించుకోవడం లేదంటే... వారే తనపై ఉసిగొల్పారేమో అని బాబు ఆరా తీయకుండానే భయపడి ఇంకా దూరం జరిగారు. తిరిగి విమర్శలు చేశారు. జగన్  కి కావాల్సింది కూడా ఇదే. తాను తిడితే బాబు క్రెడిబులిటీ తగ్గదు అని... బీజేపీ, జనసేనతో తిట్టించారు. 

ఇందుకోసం బీజేపీ నేతలను కొనడం ద్వారా బీజేపీతో తిట్టించారు. టీడీపీ జనసేన ఒకటే ప్రచారం చేసి వారిద్దరూ తిట్టుకునేలా వ్యూహరచన చేేశారు. అన్నిటినీ నమ్ముతూ పోయిన చంద్రబాబు బొక్కబోర్లా పడ్డాడు. ఇక వీరి విమర్శలకు చంద్రబాబు బీజేపీ మొత్తాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఆ పనికిమాలిన ఇగోకు పోయిన బీజేపీ పెద్దలు జగన్ కు అండగా నిలిచారు. కట్ చేస్తే ఇన్నాళ్లకు వారికి నిజాలు కనిపించాయి. భ్రమలు తొలిగాయి. బాబును తిట్టడం ద్వారా జగన్ కు రూటు క్లియర్ చేసిన బీజేపీ ఇపుడు జగన్ గురించి వాస్తవాలు తెలుసుకుంటోంది. ఇపుడు స్వయంగా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు జగన్ గురించి పచ్చినిజాలతో కూడిన విమర్శలు చేశారు. జగన్ అరాచక పాలన చూడలేం... దయచేసి కాపాడండి అని కేంద్రానికి లేఖ రాశారు కన్నా లక్ష్మినారాయణ. జగన్ అధికారం చేపట్టాక గానీ చంద్రబాబు విలువు బీజేపీకి తెలియరాలేదు. 

ఇంతకీ కన్నా ఏమన్నాడో తెలుసా...

1956 నుంచి ఎన్నడూ లేనంత దౌర్జన్యంగా హింసాయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అప్రజాస్వామిక విధాాలతో బలప్రయోగంతో పాతిక శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుున్నారు. ఎక్కడ నిబంధన పాటించలేదు. కరోనా వల్ల ఎన్నికల కమిషనర్ వాయిదా వేస్తే... ఆయనను సీఎం నుంచి మొదలుకొని మొత్తం వైకాపా నేతలు తీవ్రంగా దూసించారు. భయానకంగా ప్రవర్తించారు. అభ్యంతరకరమైన భాషతో తిట్టారు. రాష్ట్ర పోలీసులు వైసీపీ మాటే వింటున్నారు. ఎన్నికల కమిషనర్ కు భద్రత కల్పించండి. 

 

ఈ లేఖతో అయిన కేంద్రం జగన్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుందా? చూడాలి మరి.