ఏపీ రాజ‌కీయాలు ఆయనకు ఇలా క‌లిసొచ్చాయా...!

February 18, 2020

రాజ‌ధాని ర‌చ్చ‌ను బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుందా? ఇక్క‌డ జ‌రుగుతున్న ర‌గ‌డ‌ను త‌న పార్టీకి ప్ర‌ధాన వ‌న‌రుగా మా ర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి రాజ‌ధాని గురించి మాట్లాడే అర్హ‌త బీజేపీకి ఇక్క‌డి ప్ర‌జ‌లే గ‌తంలో నిన‌దించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ న‌ర‌స‌రావు పేట నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర సార‌థి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. అలాంటి చోట ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు క‌న్నా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఒక ప‌క్క పోరు చేస్తోంది.అయితే, ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌ధానంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, అమిత్ షాల‌పై ప్ర‌త్యేకంగా న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే ఆయా నేత‌ల మాస్కులు ధ‌రించి ధ‌ర్నాల్లో పాల్గొంటున్నారు. దీంతో త‌మ పార్టీకి జోష్ వ‌చ్చింద‌ని భావిస్తున్న క‌న్నా ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.
ప్ర‌ధాని హోదాలోమోడీ శంకు స్థాప‌న చేసిన ఉద్దండ‌రాయుని పాలెంలో శుక్ర‌వారం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మౌన దీక్ష చేయ‌డంతోపాటు రాజ‌ధానిని అమ్ముకునేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో శ‌నివారం గుంటూరు బంద్‌కు కూడా క‌న్నా పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం ద్వారా రాజ‌ధాని ప్రాంతంలో బీజేపీని పుంజుకునేలా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.
అయితే, అదే స‌మ‌యంలో ఇప్పుడున్న వేడిని బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. మ‌రో వ‌ర్గం ప్ర‌జ‌లు మాత్రం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హామీల విష‌యంలో క‌న్నా ఎందుకు జోక్యం చేసుకోలేక పోతున్నా రు? అనే ప్ర‌శ్న‌ను కూడా సంధిస్తున్నారు. అదేస‌మ‌యంలో క‌న్నా వ్యూహాన్ని పార్టీలోని కీల‌క నాయ‌కులు అందిపుచ్చుకోలేక పోవ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. క‌న్నా ఒంట‌రి పోరు చేస్తున్నా.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు విశాఖ స‌హా ఇత‌ర జిల్లాల‌కు చెందిన బీజేపీ నేత‌లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాజ‌ధాని ర‌గ‌డ‌లో క‌న్నా కేవ‌లం ఓ తురుపు ముక్క‌గా మారిపోతారా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.