జగన్ ఏం చేస్తున్నాడో ఇపుడు తెలిసిందా మీకు ?

June 03, 2020

ఈరోజు బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం హిందు ధర్మాన్ని తక్కువ చేస్తోందని, ప్రభుత్వం అనేది అన్ని మతాలను సమానంగా ఆదరించాలని...అన్నారు. ఏపీ సర్కారు చాలా వ్యూహాత్మకంగా హిందు ఆలయాలు, కార్యక్రమాలపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర పన్నుతోందన్న అనుమానాలు వ్యక్తంచేశారు కన్నా లక్ష్మినారాయణ. బీజేపీ అధ్యక్షుడు ఇపుడు ఎందుకు మేల్కొన్నారో ఆయనకే తెలుసు. 

కానీ చాలా కాలం నుంచే ఇది జరుగుతోంది. ఈ ప్రభుత్వం రాగానే చర్చిల నిర్మాణానికి నిధుల విడుదల చేసింది. ఒక కలెక్టరు మన వాళ్లకే ఉద్యోగాలు ఇప్పించుకుందాం అని బహిరంగ వేదికపై ప్రకటించారు. ఆయన దృష్టిలో మన వాళ్లు అంటే క్రిస్టియన్లు. దీనికి వీడియో సాక్ష్యాలున్నాయి. అంతేకాదు... దుర్గ గుడిలో అన్ని రకాల రేట్లు పెంచారు. తిరుమలలో ధరలను సవరించారు. లడ్డులపై సబ్సిడీ ఎత్తేశారు. గుంటూరు జిల్లాలో కొండలపై శిలువలు వెలిశాయి. తిరుమల ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై జెరూసలెం యాత్ర ను ప్రచారం చేశారు. అమెరికాలో దీపం వెలిగించడానికి జగన్ తిరస్కరించారు. హిందు ఆలయాల్లో ఇతర మస్తులను నియమించారు. ఆ తర్వాత అన్ని దేవాలయాల్లో ఇతర మతస్తులను తొలగిస్తామని ప్రకటించిన సీఎస్ నే తీసిపడేశారు. 

ఇన్ని ఘోరాలు జరిగితే ఆనాడు స్పందించని కన్నా లక్ష్మీనారాయణ... ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారో మరి. ఆయన చెప్పాలి. అయినా... ఎన్నికల ముందు అయినా తర్వాత అయినా జగన్ తాను హిందువును కాదు అని అనేక మార్లు నిరూపించారు. అయినా తమది హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఆయనకు సైలెంటుగా తమ మద్దతు ప్రకటించింది. ఇపుడేమో జగన్ ... ఏకుమేకవుతున్నాడు. 

తాజాగా తన బాస్ మోడీకి ట్విస్టిచ్చాడు జగన్... రాష్ట్రంలో ఎన్పీఆర్ నిలిపివేస్తామని జగన్ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల స్టంట్. వాస్తవానికి జగన్ చెప్పాల్సింది ఎన్నార్సీ ని నిలిపివేస్తామని. కానీ అలా చెప్పలేదు. ఎన్ పీఆర్ జనాభా లెక్కలకు సంబంధించినది. అది ఒక సాధారణ ప్రక్రియ. దాన్ని జగన్ ఎలాగూ నిలిపివేయడు. కానీ ఎన్నికల కోసం ముస్లిం ఓట్ల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. అంతే... అది అమలయ్యే సీన్ లేదు.