ఏపీలో కన్నాను అమ్మేశారట... కొన్నది ఎవరో తెలుసా?

May 29, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెం.2 అయిన విజయసాయిరెడ్డిది పొద్దున లేచిన దగ్గర్నుంచి ఒకటే పని. చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు మీద విమర్శలు చేయడం. చంద్రబాబును బదనాం చేయడం. చంద్రబాబు అధికారంలో ప్రజలకు పాలకుల మీద అనుమానాలు సహజంగా ఉంటాయి కాబట్టి అపుడు సాయిరెడ్డి ఆటలు చెల్లాయి. అబద్దాలు రాజ్యమేలాయి. కానీ ఇపుడు అధికారంలో ఉన్నది వైసీపీ. ప్రతిపక్ష నాయకుడిని నిరంతరం తిడుతూ ఉంటే వర్కవుటవుతుందా? సమస్యే లేదు. జనం ఎపుడూ ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకుంటారు. ఎందుకంటే... అవినీతికి తప్పులకు, పనికి దేనికయినా అధికారమే కేంద్రం. కాబట్టి... జనాలకు పని చేసిపెట్టకుండా ప్రతిపక్షాన్ని తిట్టినంత మాత్రాన ప్రజల దృష్టి మరల్చవచ్చనుకుంటే అది వైసీపీ భ్రమ మాత్రమే. ఇక ఈరోజు కోటాలో చంద్రబాబుతో పాటు కన్నాపై విల్లు ఎక్కుపెట్టాడు విజయసాయి. 

 

నిన్నటి వరకు కన్నా అందరి వాడు. రాత్రి నుంచి చంద్రబాబు మనిషి అయిపోతాడా? చంద్రబాబు వెంట నడవడానికి ఆయన దగ్గర ఏమైనా అధికారం ఉందా? మరెందుకు కన్నా చంద్రబాబుకు అమ్ముడుపోతాడు... సాయిరెడ్డి నోటికి వచ్చిందంతా చెబితే జనం చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు కదా. మరీ విచిత్రం ఏంటంటే... ’కన్నా చంద్రబాబుకు రాజకీయానికి వంత పాడుతున్నాడు‘‘ అని విమర్శలు చేసిన జనం నమ్మేవారేమో... కానీ ఏకంగా కన్నా లక్ష్మీనారాయణను అమ్మేశారట. అమ్మింది బీజేపీ నేత సుజన చౌదరి అట. కొనుక్కున్నది వస్తువట. ఇంతకంటే చవట విమర్శ ఏమైనా ఉంటుందా? 

 

ఏపీలో ఒక్క సీటు రాకపోయినా.... రాజభోగం అనుభవిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. దీనికి కారణం ఏంటో అందరికీ తెలుసు. పుట్టెడు కేసుల్లో ఇరుక్కున్న జగన్ జుట్టు బీజేపీ చేతిలో ఉంది. ఇపుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీకి ఏపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నాం. అందుకే శాసనసభలో ప్రాతినిధ్యం లేపోయినా... తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కన్నా బిందాస్ గా ఉన్నారు. కన్నాను ఏమీ అనలేక... కన్నా చంద్రబాబు మనిషి అంటే... ఆయన చేసే విమర్శలు చంద్రబాబు ఖాతాలో పడతాయని... తద్వారా చంద్రబాబును బదనాం చేసి తాము సేవ్ అవ్వచ్చని చీప్ ట్రిక్స్ వైసీపీవి. ఇప్పటికే వైసీపీకి ఓటేసినందుకు ఏపీ ప్రజలు తలలు గోక్కుంటున్నారు. కోరి కష్టాలు తెచ్చుకున్నామని ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తలకిందులు తపస్పు చేసినా ఏపీ ప్రజల మనసు గెలిచే పరిస్థితి లేదు. దేశంలో కరోనా వ్యాప్తి గుర్తించలేని స్థితిలో ఉన్నది రెండే రెండు రాష్ట్రాలు ఒకటి మహా రాష్ట్ర. ఇంకోటి ఏపీ. ముందు దీన్ని అధిగమించకపోతే సీఎం సీటు నుంచి జగన్ తనంతట తాను దిగిపోయే పరిస్థితి వస్తుంది.