జగన్ గుర్తించిన కొత్త శక్తి ఆయన- కీలక శాఖలు ఆయనకేనా? 

August 15, 2020

జగన్ కేబినెట్ ఏర్పాటుచేసినపుడు ఈ పదవులు అందరికీ శాశ్వతం కాదని అన్నారు. ఎవరు బాగా పర్ ఫాం చేస్తే వారి పదవులు మాత్రమే ఉంటాయన్నారు. అయితే, 2.5 సంవత్సరాలకు మార్పు ఉంటుందన్నారు. అయితే, అనుకోకుండా  ఏడాదిలోనే రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో జగన్ తన ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఏడాది క్రితం కూర్చిన కేబినెట్  ఏదైతే ఉందో అందులో కొందరు జగన్ ని బాగా డిజప్పాయింట్ చేశారు. వారిలో సుచరిత, ఆళ్ల నాని కూడా ఉన్నారు. జగన్ కి బాగా నచ్చిన వాళ్లలో అనిల్ కుమార్, పేర్ని నాని తదితరులు ఉన్నారు.

అయితే, అందరికంటే కన్నబాబు పనితీరు జగన్ కి బాగా నచ్చిందంటున్నారు. కన్నబాబుకు మంచి అవగాహన, మాట తీరు ఉండటం వల్ల వైసీపీ హార్డ్ కోర్ మనస్తత్వం లేకపోవడం కూడా అతనికి ప్లస్సే అంటున్నారు. అందుకే కన్నబాబుకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. వైసీపీ కి అత్యంత లాయల్ వ్యక్తిగా ఉండే అనిల్ కుమార్ కూడా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి.

కొత్తగా మంత్రి పదవులు భర్తీ చేస్తే ఆ అవకాశం రోజాకి రావచ్చంటున్నారు.  లేదంటే పనిలో పనిగా సుచరితను మార్చి ఆ శాఖ అదే వర్గానికి చెందిన వైఎస్ సన్నిహితుడు పినిపె విశ్వరూప్ కి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇది కన్నబాబుకి ఇవ్వాలనుకున్నా... ఎస్సీలను వాడుకుని వదిలేశారన్న భావన రాకుండా ఆమె శాఖ మారుస్తారేమో అంటున్నారు.

ఆళ్ల నాని పోస్టు వైద్య శాఖ ఇపుడు కీలకం. కానీ ఆయన అందుబాటులోకి రావడం లేదు. సరిగా ఎలివేట్ అవడం లేదు. దీంతో ఆ పోస్టులోను మార్పులు జరుగుతాయోమో అంటున్నారు. 

జగన్ హయాంలో హోం శాఖ, విద్యా శాఖ, వైద్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటిలో మార్పులు తప్పడం లేదు. ఆదిమూలపు సురేష్ పై జగన్ కి పెద్ద డిజప్పాయింట్ ఏమీ లేదు. కాబట్టి ఆయన మారకపోవచ్చు.