కరాచీలో కూలిన విమానం - 100 మందికి పైగా మృతి

August 11, 2020

లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఎ) విమానం శుక్రవారం జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రాంతంలో కూలిపోయింది. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు అధికారికంగా తెలిపారు. 5 నిమిషాల్లో దిగాల్సిన విమానం కూలిపోవడంతో వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విమానం ల్యాండింగ్ కోసం సమీపిస్తున్న సమయంలో విమానాశ్రయం సమీపంలోని జిన్నా గ్రౌండ్ ప్రాంతంలో కూలిపోయింది. 

పాకిస్తాన్ లో కూలిన ఈ ఎయిర్‌బస్ విమానం తూర్పు నగరమైన లాహోర్ నుండి వచ్చింది. ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. 

జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న నివాస ప్రాంతంలో కూలిపోయే ముందు ఎయిర్‌బస్ ఎ 320 రెండు, మూడు సార్లు ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని  దేశ పౌర విమానయాన అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ కోఖర్ పేర్కొన్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కూలిపోయిన విమానం పికె -303 గా పేర్కొన్నారు. మాలిర్ లోని మోడల్ కాలనీకి సమీపంలో ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. 

నాలుగేళ్లలో పాకిస్తాన్ క్యారియర్‌కు ఇది రెండవ విమాన ప్రమాదం. గతంలో ATR-42 విమానం కూలి 47 మంది మృతి చెందారు. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే విమాన సర్వీసులను పాకిస్తాన్ తిరిగి ప్రారంభించిన వారం రోజుల్లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

pakistan PIA crash Video : https://twitter.com/i/status/1263787780603285504 

pakistan plane crash video : https://twitter.com/i/status/1263787255551995906