వైసీపీలోకి చంద్రబాబు పెళ్లి పెద్ద..

May 25, 2020

తెలుగుదేశం పార్టీని అన్ని విధాలా ఇరుకున పెట్టి, అష్టదిగ్బంధనం చేయడం ద్వారా తనకు ఎవరూ అడ్డులేకుండా చేసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. మొదటి సారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాక జగన్ పార్టీ ఫిరాయింపులపై గొప్పలు చెప్పారు. కానీ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరంగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు జగన్. పార్టీ మారకపోతే మీరు నస్టపోతారు అంటూ మౌఖిక బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కరడగట్టిన టీడీపీ నేతలను వారి వ్యాపారాలను కూలుస్తామని బెదిరించి వారిని టీడీపీ నుంచి బయటకు తీసుకురావడం ద్వారా ఆ పార్టీని బలహీనపరచాలన్నదే వైఎస్ జగన్ ప్లాని అని విశ్లేషకులు చెబుతున్నారు. 

వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి నేతలు పార్టీకి బలమైన నేతలు. అలాంటి వారిని కూడా చెదరగొట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కరణం బలరాం అయితే... టీడీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. అలాంటి నేతలు పార్టీ నుంచి బయటకు పోతే టీడీపీ శ్రేణులు చెల్లాచెదురుఅవుతాయన్నది వైసీపీ ఆలోచన. దానికి తగ్గట్టు పథకరచన చేస్తోంది. వారి వారి వ్యాపారాలనే దీనికి ఆయుధంగా మలచుకుంటోంది. తమ వ్యాపారాలను కుప్పకూల్చుకోలేక నేతలు బలహీనతలకు లొంగి టీడీపీపై నిందలు వేస్తున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పలువురు నేతలు సైకిల్ దిగుతున్నారు. కడప జిల్లాలో కీలక నేత సతీష్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. రామసుబ్బారెడ్డికి కూడా ఇవే వార్తలు వస్తు్నాయి. అయితే వీరందరికీ మించిన మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి కరణం బలరాం.
ఒకట్రెండు రోజుల్లో బలరాం వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరణం బలరాం తొలుత కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1978లో ఆయన కాంగ్రెస్(ఐ) తరఫున అద్దంకి నుండి పోటీ చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు పరిచయం చేసింది కరణం బలరామే. చంద్రబాబుకి ఎన్టీఆర్ మధ్య మంచి పరిచయాలు ఏర్పడటానికి కారణం కూడా కరణం బలారమే. అంతే కాదు... చంద్రబాబు తరఫున పెళ్లి పెద్ద కూడా ఈయన వ్యవహరించారు. అలాంటి నేత టీడీపీకి దూరం కానుండటం గమనార్హం. వాస్తవానికి ఇది బలవంతపు ఫిరాయింపు అని స్పస్టంగా తెలుస్తోంది. మరి అరాచక రాజ్యంలో ఇలాంటి ఘటనలు మామూలే.