సంచలనం- సీన్ మొత్తం మార్చేసిన స్పీకర్ !!

July 11, 2020

వ‌డ్డించేటోడు మ‌నోడైతే.. బంతిలో ఎక్క‌డ కూర్చున్నా రావాల్సిన‌వ‌న్నీ వ‌స్తాయ‌ని ఊరికే అన‌లేదేమో. తాజాగా క‌ర్ణాట‌క‌లోచోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. య‌డ్డి స‌ర్కారు బ‌ల‌ప‌రీక్ష‌కు ఒక రోజు ముందు క‌ర్ణాట‌క రాజ‌కీయ ముఖ‌చిత్రం మొత్తాన్ని మార్చేసేలా స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు అనూహ్యంగా మారింది.
స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యంతో య‌డ్డి స‌ర్కారుకు ఎలాంటి ఇబ్బంది లేని ప‌రిస్థితి. ఎందుకంటే.. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలపై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేస్తూ నిర్‌న‌యం తీసుకున్నారు. బ‌ల‌ప‌రీక్ష‌లో కుమార‌స్వామి ప్ర‌భుత్వం ప‌త‌న‌మైన త‌ర్వాతి రోజే ముగ్గురు ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన స్పీక‌ర్.. తాజాగా అన‌ర్హ‌త వేటు వేలాడుతున్న 14 మంది ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.
తాజాగా వేటు ప‌డిన వారితో క‌లుపుకొని ఇప్ప‌టివ‌ర‌కూ వేటు ప‌డిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు జేడీఎస్ నేత‌లుగా.. 14 మంది కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు. దీంతో..బ‌లాబ‌లాల విష‌యంలో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెప్పాలి. కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన య‌డ్డి స‌ర్కారు రేపు (సోమ‌వారం) బ‌ల‌ప‌రీక్ష‌నుఎదుర్కోవాల్సి ఉంది. ఈ వేళ‌లో అన‌ర్హ‌త వేటు ప‌డ‌టంతో స‌మీక‌ర‌ణాలు మారిపోయిన ప‌రిస్థితి.
స్పీక‌ర్ తాజా నిర్ణ‌యంతో క‌ర్ణాట‌క అసెంబ్లీలో స‌భ్యుల సంఖ్య 207కు ప‌డిపోగా.. మేజిక్ ఫిగ‌ర్ 104గా మారింది. ఇదిలా ఉంటే.. బీజేపీకి సొంత‌బ‌లం 105 ఉండ‌గా.. ఒక స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఉంది. దీంతో రేప‌టి రిజ‌ల్ట్ ఈ రోజే వెల్ల‌డైన‌ట్లుగా తాజా ప‌రిణామం చేసింద‌ని చెప్పాలి.