జగన్‌ను ఇబ్బంది పెట్టేస్తున్న తెలంగాణ, కర్ణాటక

May 24, 2020

ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్రంలోని విపక్షాల నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇబ్బందులు వస్తున్నాయి.. అయితే, ఈ ఇబ్బందులు అక్కడి ప్రభుత్వాల వల్లో ప్రజల వల్లో కాదు. అక్కడి, ఇక్కడి అక్రమ వ్యాపారల వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మద్య నియంత్రణ దిశగా జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పొరుగు రాష్ట్రాల నుంచి అడ్డుపుల్ల పడుతోంది.
ఏపీలో ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాలు మూసేసి, సర్కారీ వైన్ షాప్స్ తెరిచారు. బార్లలో మద్యం రేట్లను భారీగా పెంచారు. గవర్నమెంట్ వైన్ షాపులలో మద్యం రేట్లు కూడా పెరిగాయి. అయితే, అక్కడ కొన్ని రకాల మద్యం మాత్రమే లభిస్తోంది. ఈ క్రమంలో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు చాలా తక్కువ. దీంతో కొందరు ఆయా రాష్ట్రాల్లో మద్యం కొనుగోలు చేసి.. అక్రమంగా వాటిని ఏపీలోకి తరలిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్నూలు, కర్ణాటక సరిహద్దులో ఉండే అనంతపురం జిల్లాల్లో ఈ తరహా అక్రమ మద్య రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల రహస్యంగా బెల్టు షాపుల తరహా దుకాణాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణ పక్కనే ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోకి తెలంగాణ మద్యం ఏరులై పారుతోందట. ఖమ్మం జిల్లా పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తెలంగాన మద్యం ఫుల్లుగా దొరుకుతోందని చెబుతున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు పొరుగునే ఉన్న నల్గొండ జిల్లా నుంచి భారీగా మద్యం సప్లయ్ అవుతుందని తెలుస్తోంది. 

Read Also

ఏపీలో మంత్రులంతా జీరోలే... అంతా జగన్ మయం !!
రాయ్ లక్ష్మి మరో క్లీవేజ్ షో
మహా సెక్సీ గాల్... సూపర్ హాట్ సెల్ఫీ !