45 ఏళ్ల ఆంటీ ఇంత హాటా?

August 08, 2020

వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ అందం త‌గ్గుతుంద‌న్న‌ది పాత మాట‌. ఇప్పుడు కొంద‌రు బ్యూటీల‌ను చూస్తే ఇది ఏ మాత్రం నిజం కాద‌నిపించ‌క మాన‌దు. పెరిగే వ‌య‌సుతో అంత‌కంత‌కూ పెరిగే అందంగా మిస‌మిస‌లాడుతూ కుర్ర బ్యూటీ సైతం అసూయ ప‌డే అందం కొంద‌రి సొంతం. తాజాగా బాలీవుడ్ న‌టి క‌రిష్మాక‌పూర్ 45 ఏళ్ల వ‌య‌సులో హాట్ బేబీకి త‌గ్గ‌ని రీతిలో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతున్నాయి.
ఒక‌ప్పుడు త‌న అందంతో యూత్ ను ఒక ఊపు ఊపేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. భ‌ర్త‌తో విడిపోయి ఇద్ద‌రుపిల్ల‌ల బాధ్య‌తను మోస్తున్న ఆమె ఇటీవ‌ల కుటుంబంతో పాటు లండ‌న్ ట్రిప్ కు వెళ్లారు. విహార యాత్ర‌లో భాగంగా అక్క‌డి బీస్ లో బికినీ వేసుకొని దిగిన ఫోటోల్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఎంత వ‌య‌సు వ‌చ్చినా మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోండంటూ ఇచ్చిన క్యాప్ష‌న్ కు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఆమె ఫోటోలు ఉన్నాయ‌ని చెప్పాలి. ఆంటీ అన్న వాళ్ల క‌ళ్లు పోయేలా ఆమె తాజా ఫోటోలున్నాయి. త‌న ఫోటోల్ని పోస్ట్ చేసిన కొద్దిసేప‌టికే ల‌క్ష‌కు పైగా లైకులు రావ‌టం గ‌మ‌నార్హం.
ఆమె ఫోటోల‌కు బాలీవుడ్ న‌టీమ‌ణులు క‌త్రినా కైఫ్.. అమృతా అరోరా.. కియారా అడ్వాణీ.. అథియా శెట్టి లాంటి ప‌లువురు లైక్ చేస్తూ కామెంట్లు పెట్టారు. కుర్ర‌భామ‌ల‌కు తీసిపోని రీతిలో ఫిట్ గా ఉన్న ఆమెను చూస్తే.. సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్నారా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.
ఇక‌.. ఎప్ప‌టిలానే ఈ ఫోటోల‌పై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవారు రియాక్ట్ కాగా.. నెగిటివ్ గా రియాక్ట్ అయినోళ్లు ఉన్నారు. ఈ వ‌య‌సులో ఇలాంటి ఫోటోలేంది? ఈ దుస్తులేంద‌ని విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డితే.. మ‌రికొంద‌రు మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. క‌రిష్మా త‌న క్యాప్ష‌న్ కు త‌గ్గ‌ట్లే త‌న‌ను తానెంత‌గా ప్రేమించుకుంటున్న విష‌యాన్ని తాజా ఫోటోల‌తో ఫ్రూవ్ చేశార‌ని చెప్పాలి.