అరటిలో విషంపెట్టి 20 ఆవులను చంపేశారు

August 11, 2020

బీజేపా పాలిత రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. ఇటీవలే పైనాపిల్ బాంబు పెట్టి ఓ ఏనుగును క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆవులుపై ఇలాంటి అరాచకత్వానికి పాల్పడ్డారు ఇంకొందరు దుండుగలు.

కర్ణాటక రాష్ట్రంలో కాఫీ తోటలు ఎక్కవనే విషయం తెలిసిందే.

కొన్ని ఆవులు ఆహారం కోసం కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్‌లోకి చొరబడ్డాయి.

అవి కాఫీ తోటలను మేసేస్తున్నాయని ఎస్టేట్ వారికి  కోపం వచ్చింది.

దీంతో కాఫీ తోట మేనేజరు, సిబ్బంది వాటిని వదిలించుకోవడానికి నికృష్టమైన పని చేశారు.

అరటి పళ్లలో విషం పెట్టి ఆవులకు తినిపించారు. దీంతో 20 ఆవులు మృతిచెందాయి.

ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎందుకంటే వారు ఆవులను ఒక్కొక్కటిగా చంపడం మొదలుపెట్టారు.

రోజుకో ఆవు మిస్సవడంతో ఎక్కడికో పోయాయని యజమానులు ఎక్కడెక్కడో వెతికే వారు.

ఇలా రోజు జరగడంతో వారికి అనుమానం వచ్చింది. ఆవులను వెంబడించి అవి ఎక్కడికి పోతున్నాయో గమనించారు. అవి కాఫీ తోటలకు వెళ్తున్న విషయం గమనించి వాటిని వారే మాయం చేసి ఉంటారని అనుమాన పడ్డారు.

కాఫీ చోట పరిసరాల్లో వెతకగా కొత్తగా మట్టితీసి పూడ్చినట్టు సమాధుల్లా గోతులు కనిపించాయి. వాటిని తవ్వి చూడగా... ఆవుల మృతదేహాలు బయటపడ్డాయి. 

దీంతో ఆవుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోహత్య మహాపాపం అని అంటంటారు. మరి దుండుగలు అంతసులువుగా ఆ మూగ జీవాలను ఎలా చంపగలిగారో అనిపిస్తుంది.

అదిలిస్తే పోతాయి. మళ్లీ మళ్లీ వస్తుంటే కంచె వేసుకుంటే సరిపోతుంది గాని ఆవులను చంపడం ఏంటి? నికృష్ట ఆలోచనల వల్లే ప్రకృతి ఈరోజు కరోనా రూపంలో మనుషులను వేధిస్తోంది అనుకోవాలేమో.

మరి అసలే బీజేపీ ప్రభుత్వం. నిందితులు ఈ కేసు నుంచి బయటపడటం అంత సలువు కాదు.