వాడు.. ఆథరైజ్డ్ డ్రింకర్ అట !!

May 30, 2020

ఆర్ ఎక్స్ 100 మూవీతో పెద్ద హిట్ అందుకున్న కార్తికేయ... అడుగులు తడబడుతున్నాయి. తర్వాత వచ్చిన హిప్పీ డిజాస్టర్ కాగా... గుణ 369 ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. అయితే... ఆర్ ఎక్స్ పుణ్యమా అని ఇంకా అతనికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తొలి సినిమా నిర్మాతలు కొత్త సినిమా తీస్తున్నారు.

కార్తికేయ ఈసారి కనుక సత్తా చూపకపోతే కష్టం. ఈ సినిమా టైటిల్ ను తాజాగా రిలీజ్ చేశారు. టైటిల్ అదిరింది. దాని క్యాప్షన్ ఇంకా బాగుంది. మందు బాటిళ్లు కుప్పగా పోసి వాటిపై కార్తికేయ పడుకున్న స్టిల్ ను 90 ML టైటిల్ తో విడుదల చేశారు. క్యాప్షన్ ... యన్ ఆథరైజ్డ్ డ్రింకర్. ఈ క్యాప్షన్ చాలా క్యాచీగా ఉండటంతో సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. 

Read Also

జాతీయ మీడియాలో జగన్ గాలిపోయింది
రకుల్... బ్యూటీ ఇన్ బ్లాక్ !!
‘సైరా’లో పది గూస్ బంప్స్ సీన్స్