పాత హీరోయిన్ తో ప్రభాస్ జోడి !!

August 08, 2020

అదేంటి... పాన్ ఇండియా ట్రెండ్ సృష్టించిన ప్రభాస్ పాత హీరోయిన్ ఏంటి అనుకుంటున్నారా? అదేలేండి... గొప్పగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ భామ ప్రభాస్ తో జట్టుకడుతోంది అని చెప్పుకోవచ్చు. కానీ తెలుగు వారికి ఆమె పాత హీరోయినే. ఎపుడో 2005లో పదిహేనేళ్ల క్రితం వెంకటేష్ తో, బాలకృష్ణతో సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఇపుడు అక్కడ స్టార్ హీరోయినే. పెద్ద సినిమాలే చేసిందనుకోండి. కానీ తెలుగు వారికి మాత్రం పాత హీరోయినే. అది సరే.. ఆమె ప్రభాస్ తో ఏ సినిమా చేస్తోందో తెలుసుకుందాం. 

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఇది ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేశారు. అశ్వినీదత్ నిర్మాతగా, ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా ప్రపంచ స్థాయి సినిమా తీయాలని డిసైడయ్యారు. భారీ బడ్జెట్ ప్రాజెక్టే ఇది. అందుకే బాలీవుడ్ భామ అయితే బెటరని వెతుకుతున్నారు. ప్రియాంక అనుకున్నారు. కుదరలేదు. దీపిక అనుకున్నారు. సరిపోలేదు. ఇపుడు కత్రినా కైఫ్ దాదాపు సెట్ చేసుకున్నట్టు సమాచారం. మరి అధికారికంగా ఎపుడు వెల్లడిస్తారో మరి. ప్రస్తుతానికి అయితే... ఇదే ఫిల్మ్ నగర్ అప్ డేట్. కత్రినా వయసు 36 సంవత్సరాలు. ప్రభాస్ వయసు 40 సంవత్సరాలు.