బిల్లు బకాయిలపై సంచలన నిజాన్ని చెప్పిన కేసీఆర్

January 20, 2020

అనుకున్న షెడ్యూల్ కు తెలంగాణ బడ్జెట్ ప్రసంగాన్ని షురూ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మాంద్యం తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పేశారు. అంతేకాదు.. ఆయన మొత్తం ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు చివర్లో చెప్పిన ఒక విషయం విన్నంతనే షాక్ తగిలిన పరిస్థితి.
గడిచిన కొద్ది రోజులుగా భారీ ఎత్తున బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని చెల్లించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కిందా మీదా పడుతోందన్న విషయంపై కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా చేసిన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడున్న బకాయిల్ని చెల్లించిన తర్వాతనే కొత్త ఖర్చులు పెడతామని చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో కొత్త ఖర్చులు దాదాపుగా ఉండవనే చెప్పాలి.
ఖర్చుల కంటే ముందు.. తొలుత అన్ని శాఖల పరిధిలో ఉన్న బకాయిల్ని తీర్చటమే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. అంటే.. ఇప్పటికే చేసిన అప్పుల్ని తీర్చటం తప్పించి.. మంత్రులెవరికి ఎలాంటి పని ఉండదన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిమితుల నేపథ్యంలో ప్రభుత్వ విధానాలకు లోబడి.. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి.. వాటిని క్లియర్ చేసుకున్న తర్వాతే కొత్త పనులు స్టార్ట్ చేస్తామన్న చేదు నిజాన్ని చాలా తెలివిగా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ చెప్పారని చెప్పక తప్పదు. 

Read Also

బడ్జెట్ పెట్టావా.. బీజేపీని తిట్టావా కేసీఆర్?
ఒక్క ఎంపీ టార్గెట్‌గా రెండు మంత్రి ప‌ద‌వులు..!
ప్రయోగాల జోలికి వెళ్లని కేసీఆర్