కేసీఆర్.. జ‌గ‌న్.. బాబు బాట‌లో నడవక తప్పదా?

July 09, 2020

ఒక్కో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ ముగుస్తున్న కొద్దీ కేంద్రంలో ప‌వ‌ర్లోకి వ‌చ్చే వారిపై కాస్తంత క్లారిటీ వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి. 2014తో పోలిస్తే 2019లో మోడీ వేవ్ పెద్ద‌గా లేక‌పోవ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. సామాన్య ప్ర‌జానీకంతో పాటు.. ఇదే భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ప్ర‌ధాని స్థిమితం కోల్పోయేలా మాట్లాడుతున్న మాట‌లు.. పొలిటిక‌ల్ మైలేజీ కోసం దేనికైనా స‌రే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణి కూడా ఈ అనుమానాల్ని మ‌రింత పెంచేలా చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఇప్పుడు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందే.. ఎవ‌రేమిట‌న్న అంశంపై లోగుట్టుగా ఒక నిర్ణ‌యానికి రావ‌టం తెలిసిందే. ఏపీ అధికార‌ప‌క్షం ఒక్క‌టి మాత్రం ఓపెన్ గా కాంగ్రెస్ కు జై కొట్ట‌టం.. యూపీఏలో చేరిపోతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఎటువైపు మొగ్గ‌లేదు. కాస్తోకూస్తో కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విష‌యంలో సానుకూలంగా ఉన్న‌ట్లుగా సంకేతాలు పంపారు. అయితే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మొత్తం మోడీ ప్ర‌యోజ‌నాల్ని ర‌క్షించ‌టం కోస‌మే అన్న భావ‌న ఉంది. మొత్తంగా చూసిన‌ప్పుడు కాంగ్రెస్ కు వ్య‌తిరేక‌మ‌న్న విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి సందేహాల్లేవు.
ఇలాంటివేళ‌.. తాజాగా జ‌రిగిన పోలింగ్ తీరు చూస్తే.. కేంద్రంలో మోడీ స‌ర్కారు వ‌చ్చే అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే.. పోలింగ్ ముగిసే కొద్దీ.. ప్రాంతీయ‌పార్టీల్లో జోష్ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల స‌హ‌కారంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం పెరుగుతోంది. నిన్న (సోమ‌వారం) ముగిసిన కేసీఆర్.. స్టాలిన్ భేటీని చూస్తే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వైపు రావాల‌న్న సారు మాట‌కు స్టాలిన్ నో చెప్ప‌ట‌మే కాదు.. సారునే కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.
ఒక‌వేళ కేంద్రంలో మోడీకి మెజార్టీ రాని ప‌క్షంలో.. యూపీఏ కొలువు తీరే అవ‌కాశం ఉంటే.. చంద్ర‌బాబు బాట‌లోనే జ‌గ‌న్‌.. కేసీఆర్ వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కేంద్ర స‌హ‌కారం లేకుంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న విష‌యాన్ని గుర్తించి ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ కు ఓకే కానీ.. కాంగ్రెస్ ను తెలంగాణ‌లో నామ‌రూపాల్లేకుండా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ ను గాంధీ ఫ్యామిలీ ఓకే చేస్తుందా? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం దొర‌కాలంటే కొంత‌కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.