ఇన్నాళ్లు కేసీఆర్ తిరిగింది దానికోసమా?

June 01, 2020

కేసీఆర్ ఇతర రాష్ట్రం వెళితే చాలు... కేసీఆర్ ని మోసే పింక్ మీడియా, జగన్ ని మోసే బ్లాక్ మీడియా రెండూ కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఫిడేలు రాగం పాడతాయి. ఉన్నవి 17 సీట్లలో ఎన్నొస్తాయో తెలియదు. కానీ... కాంగ్రెస్ మద్దతు ఇస్తే తీసుకుంటా అని భారీ కామెడీ చేస్తున్నాడు కేసీఆర్. దేశమంతా తమ సీట్లన్నీ తెచ్చి కేసీఆర్ కాళ్ల వద్ద పెడితే తాను పీఎం అవుతానని కలలు గంటున్నాడు. అదెలా అవుతావయ్యా అంటే జగన్ సీట్లన్నీ నా జేబులో ఉన్నాయి కాబట్టి నాదే దేశంలో పెద్ద పార్టీ అంటాడు.
ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. టీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటో తెలియదు. జగన్ గెలిచే సీట్లెన్నో తెలియదు కానీ దేశానికి ప్రధాని అవుతా అని బాకా ఊదుతున్నాడు కేసీఆర్. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మమతా బెనర్జీ తో సహా కేసీఆర్ ను ఎవరూ కలిసి వారు ఒక్కరు కూడా ఫెడరల్ ఫ్రంట్ రాగాన్ని ఆస్వాదించలేదు. పైగా కొందరు కామెడీగా తీసుకున్నారు. ఇక స్టాలిన్ అయితే గాలి తీసి పంపించాడు. దీంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఆ రెండు పార్టీలు తప్ప మనకు దిక్కులేవా అన్న నోటితోనే సిగ్గు ఎగ్గు లేకుండా కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ ఓకే అంటున్నాడు. ఇంతకాలం ప్రజలను నమ్మించింది ఏమని.... బీజేపీ, కాంగ్రెస్ లేని ఫ్రంట్ అని. అంత త్వరగా మాట మార్చడానికి కనీసం ఆలోచన కూడా చేయలేదు కేసీఆర్.
ఇదిలా ఉంటే ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. కేసీఆర్ అన్ని పార్టీలను కలుస్తున్నది తన ఫెడరల్ ఫ్రంట్ గురించి గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే కాదట. చంద్రబాబు తో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పడానికట. వెళ్లిన ప్రతిచోట ఏపీలో చంద్రబాబు నాయుడు గెలవడు అని, ఆయనతో మీరు కలవడం వల్ల ఉపయోగం లేదని, కావాలంటే రిజల్టు తర్వాత నేను చెప్పింది జరుగుతుంది చూడండని అంటున్నాడట. చెన్నైలో స్టాలిన్ ని కలవడానికి వెళ్లిన కేసీఆర్ చంద్రబాబు ఏపీలో గెలవడం లేదని, జగన్ మాత్రమే అక్కడ గెలుస్తాడని, వైసీపీకి 20 ఎంపీ సీట్లు వస్థాయని చెప్పాడట. అయితే స్టాలిన్ దొరకు క్లాస్ పీకి పంపించారట. ఆ సంగతులన్నీ ఏపీకి వచ్చిన డీఎంకే ప్రతినిధి దొరై మురుగన్ చంద్రబాబుకు వివరించారట.
మరీ ఎవడైనా తను ఎదగడానికి రాజకీయం చేయాలని చూస్తాడు గాని కేసీఆర్ మాత్రం చంద్రబాబు లేకపోతే మనమే ఆప్షన్ అని భ్రమల్లో ఉన్నారు. మే 23వ తేదీ హీరోలు ఎవరో తేలుతుంది. ఈ విషయం పక్కన పెడితే కేసీఆర్ సీట్లు తెలంగాణలో 10కి మించం లేదు. జగన్ కి 8-9 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.