చూశావా జగన్... నీ ఫ్రెండ్ ఏం చేశాడో

August 07, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఎవరూ ఏపీకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఆంధప్రదేశ్ కి వెళ్లడం పూర్తి నిషేధం. అంటే ఏపీకి వెళ్తే పోలీసు కేసు కూడా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనే కరోనా ఎక్కువగా ఉండటం. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు తెలంగాణ భూభాగంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఏపీలో కేసుల్లో 60 శాతం కేసులు ఈ మూడు జిల్లాలవే. అందుకే కరోనా మన రాష్ట్రంలో ప్రబలకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి.

జగన్ తన తమ్ముడు అని ఈయన, కేసీఆర్ నా బాస్ అని ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అంటారు కేసీఆర్. చివరకు ఏపీకి వెళ్లడాన్నే నిషేధించారు. కరోనా విషయంలో ఇద్దరు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. జగన్ మోడీ దారిలో నడుస్తుంటే కేసీఆర్ తనదైన సొంత దారిలో నడుస్తున్నారు. అందుకే కేసీఆర్ ఈ విషయంలో జగన్ తో కటీఫ్ అయ్యారు. బెంగుళూరు హైదరాబాదు రహదారి కర్నూలు జిల్లా మీదుగానే, పైగా కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు పట్టణం మీదుగానే వెళ్తోంది. అందుకే సరిహద్దులో కట్టుదిట్టమైన వేర్పాట్లు చేశారు. హైవేల వెంబడి హోటళ్లు ఇంకా బంద్ లోనే ఉన్నాయి. తదుపరి కొన్నాళ్లు వీటిపై నిషేధం కొనసాగవచ్చు. 

తెలంగాణలో హైదరాబాదు మినహా తెలంగాణ ఇతర జిల్లాల్లో కేసీఆర్ బాగా కంట్రోల్ చేశారు. కొత్త కేసులు కూడా రావడం లేదు. దీంతో హైదరాబాదులో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలాగానే మహారాష్ట్రకు పోవడాన్ని కూడా తెలంగాణ నిషేధించింది.