జవాబు చెప్పలేక కేసీఆర్ పరార్ !

July 02, 2020

కేసీఆర్ ను చూసి మీడియా భయపడటం అనేది హైదరాబాదులో జరుగుతుందేమో గాని ఢిల్లీలో కుదరదు కదా. తనకు అనుకూలంగా లేకపోతే కేసీఆర్ ఏ విషయంపైనా నోరు విప్పరు. బలహీనలతలతో రాజకీయం చేసే కేసీఆర్... ఎపుడైతే ఆర్టీసీ కార్మికులు జీతాల కోసం అల్లాడారో ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సంఘాలను విచ్ఛిన్నం చేశారు. 50 రోజులకు పైగా నరకం చూపించి ఆ తర్వాత కవర్ చేసుకుంటూ వచ్చారు. వారు అడిగినవి కాకుండా .... ఎమోషనల్ వరాలిచ్చే తన అభిమానులుగా మార్చుకున్నారు. కానీ తన ఇగో వల్ల నడిచిన తాత్కాలిక బస్సులు తీసిన ప్రాణాలకు లెక్క కట్టే పరిస్థితి ఉందా? లేదు. 

ఇక ఆ తర్వాత దిశ ఘటనపై కేసీఆర్ చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. నేషనల్ మీడియా గట్టిగా వాయిస్తే గాని నోరు విప్పలేదు. అంతకుముందు కొండగట్టులో 40 కి పైగా ప్రాణాలు పోతే దాని గురించి పట్టించుకోనే లేదు. ఎందుకంటే అది రాష్ట్రంలో ఓట్లను ప్రభావితం చేయదు కదా. కానీ... దిశ ఘటన తర్వాత అది జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లినపుడు కేసీఆర్ కి భయమేసింది. అపుడు దానిపై నోరువిప్పి ఖండించారు. ఉపశమన చర్యలు తీసుకున్నారు. జనాల్లో ఉద్యమం రాకపోతే అలా కొండగట్టులాగే విస్మరించేవారు కేసీఆర్. 

పక్క రాష్ట్రాల వారు స్పందించినా సొంత రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం అందరినీ విస్మయానికి గురించేసింది. ఇదే విషయాన్ని నేషనల్ మీడియా టార్గెట్ చేసింది. కేసీఆర్ దురదృష్టవశాత్తూ ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లారు. నేషనల్ మీడియాకు డైరెక్టుగా దొరికారు. జాతీయ మీడియా ప్ర‌తినిధులు కేసీఆర్‌ను ఒక్కసారిగా చుట్టుముట్టేశారు. దిశ సంఘటనపై స్పందించమని, అలాగే దిశ కుటుంబ సభ్యులని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.  మీడియా ఎంత గొంతు చించుకున్న కేసీఆర్ మాత్రం ఏ మాత్రం స్పందించకుండా అక్కడ నుంచి వడివడిగా కారెక్కి వెళ్ళిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడితే త‌న‌కు ఎన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయో అని ఆయ‌న అక్క‌డ మీడియాకు మొఖం చాటేశారు.