​కేసీఆర్ ఛాన్స్ కొట్టేశాడు

August 15, 2020

భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. స్వతంత్రం వచ్చిన ఒకటి రెండు పర్యాయాలు మినహా మరెప్పుడూ దేశమంతటా రాష్ట్రాలతో కలిపి ఒకే పార్టీ అధికారంలో లేదు. అలా సాధ్యం కూడా కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలోకి రావడం అన్నిసార్లు జరగదు. అందుకే పాలకులు నచ్చినా నచ్చక పోయినా సమాఖ్య రాజ్యమైన మనదేశంలో అందరూ కలిసి పనిచేసుకుంటూ పోవాల్సిందే. తాజాగా ఇండియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక పర్యటనకు వస్తున్నారు. ఈ టూర్లో అహ్మదాబాద్ లో ఒకరోజు, ఢిల్లీ-ఆగ్రాల్లో ఒకరోజు ట్రంప్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రత్యేక విందును ఏర్పాటుచేశారు. దీనికి 29 రాష్ట్రాలున్న 8 మంది సీఎంలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 

రాష్ట్రపతి కుటుంబం ఇస్తున్న ఈ ప్రత్యేక విందుకు ఆహ్వానం అందుకున్న అతికొద్దిమందిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. నిత్యం బీజేపీ పార్టీపై విరుచుకుపడే కేసీఆర్ ను కోవింద్ ఈ ప్రత్యేక విందుకు ఆహ్వానించడం విశేషం. కొందరు బీజేపీ సీఎంలు, ఇంకొందరు బీజేపీయేతర సీఎంలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే ఆహ్వానం దక్కింది. వీరితో పాటు నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ లకు కూడా ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా... కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ప్రత్యేకంగా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇపుడేమో విందుకు ఆహ్వానించారు. చూస్తుంటే రాంనాథ్ కోవింద్ కు కేసీఆర్ పై మంచి సాప్ట్ కార్నర్ ఉన్నట్లు తెలుస్తోంది.