కేసీఆర్ కొత్త టార్గెట్‌...ఇర‌కాటంలో గులాబీ నేత‌లు

April 04, 2020

కేసీఆర్ టార్గెట్ అన‌గానే...త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల గురించి ఆలోచిస్తూ ఉండ‌వ‌చ్చు. కానీ అది కాదు....ముందున్న అంశం గురించే..గులాబీ నేత‌లు తెగ వ‌ర్రీ అయిపోతున్నార‌ట‌. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తేనే ఆర్టీసీకి బతుకు..విలీనం చేయకపోతే సంస్థకు మనుగడ లేదు అంటూ సకలజన భేరి సందర్భంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా చేసిన డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో, క్షేత్ర‌స్థాయిలో ఆర్టీసీ కార్మికుల‌ను బుజ్జ‌గించే ఎత్తుగ‌డ వేస్తోంది. అయితే, ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు చెమ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని స‌మాచారం. ఓ మంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ..నీరుగారిపోయిన‌ట్లు తెలుస్తోంది.
గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె ఫలితంగా ప్రజలనుంచి ఒకింత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశంపై కచ్చితంగా విస్తృతస్థాయిలోనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కీల‌క నిర్ణ‌యాలు సైతం వెలువ‌డ‌వ‌చ్చు. అయితే, కార్మికుల‌ను విభ‌జించి పాలించే ఎత్తుగ‌డ‌లో బిజీగా ఉన్న ప్ర‌భుత్వ పెద్ద‌లు...ఇందుకోసం చేసిన ప్ర‌య‌త్నాలు విఫలం అయ్యాయి. ప్రజల్లో టిఆర్ఎస్‌పై అసమ్మతి పెరుగుతోందన్న ఇంటెలిజెన్స్‌ నివేదికలు అధినేత చేతికి అందడంతో ఇప్పుడు కార్మికుల వైపు నుంచే న‌రుక్కుంటు రావాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.
ఆర్టీసీ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు స్ప‌ష్టం చేస్తున్న సీఎం కేసీఆర్ త‌రచూ సమ్మెల గొడవ లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండే శాశ్వత చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా, ఓ కార్మికుడిచే...యూనియ‌న్ నాయ‌కుడిపై కేసు కూడా పెట్టించారు. అయితే, మిగ‌తా కార్మికులు మాత్రం అదే దారిలో సాగ‌డం లేదు. దీంతో వారితో మాట్లాడే బాధ్య‌త క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ మంత్రికి అప్ప‌గించార‌ట‌. ఆయ‌న ఇటు క్షేత్ర‌స్థాయిలో...అటు హైద‌రాబాద్‌లో కార్మికుల‌తో మాట్లాడుతూ...స‌ర్దిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నించినా....నేత‌లు మాత్రం విన‌డం లేద‌ని స‌మాచారం. పైగా...త‌మ‌కు ఎప్పుడూ ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని అంటున్నార‌ట‌. త‌మ‌ను ఒప్పించే బ‌దులుగా....ముఖ్య‌మంత్రినే ఒప్పించాల‌ని సూచించార‌ట‌. దీంతో...ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో తన‌వ‌ల్ల కావ‌డం లేద‌ని...స‌ద‌రు అమాత్యుడు సీఎం సారుకు చెప్పిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.