ఆర్టీసీపై కేసీఆర్ అణచివేత... ట్యాంక్ బండ్ మూసివేత

July 12, 2020

అయోధ్య కేసు వల్ల తెలంగాణలో జరుగుతున్న కీలక పరిణామాలు మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ను మరింత ఉదృతం చేసేందుకు ఈ రోజు ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేయాలని ఆర్టీసీ నాయకులు తలపెట్టారు. దీన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 

సంచలనం ఏంటంటే... తెల్లవారేలోపు ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందిని లోపల వేసినట్టు తెలుస్తోంది. హిమాయత్ గర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ నాయకులతో పాటు దీనికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నేతలను కూడా అరెస్టు చేశారు.

జిల్లాల్లో పోలీసుల పహారా పెట్టి... బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌ మూసేశారు. చుట్టూ నిఘా పెట్టారు. ట్రాఫిక్ మళ్లించారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లో  ట్రాఫిక్ ను అనుమతించరు. 
ఇదిలా ఉండగా ఈ అణచివేతను ఎన్నడూ చూడలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ దమనకాండపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.