కేసీఆర్ సందేహం - మోడీ పని ఎన్నారైల కొంపముంచుతుందేమో? !

August 12, 2020
CTYPE html>
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం సీఎం కేసీఆర్ ఈ గెలుపును రికార్డ్‌గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ చట్టం పైన ఘాటుగా స్పందించారు. ఈ చట్టాన్ని తాము ఇప్పటికే పార్లమెంటులో వ్యతిరేకించామని, అసెంబ్లీలోనూ ఈ చట్టాన్ని అమలు చేయమని తీర్మానం చేస్తామని చెప్పారు. జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 విషయంలో తాము మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ సీఏఏ రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సీఏఏపై పలువురు సీఎంలతో మాట్లాడానని, ప్రాంతీయ పార్టీలతో కాన్‌క్లేవ్ నిర్వహిస్తామన్నారు. ఈ చట్టం వల్ల దేశానికి అప్రతిష్ట వచ్చిందని, ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే ఇవి అనవసరమని అభిప్రాయపడ్డారు. మన వాళ్లు విదేశాల్లో ఉంటున్నారని, అక్కడి వారిని ఇలాగే పంపిస్తే మన వాళ్ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. విదేశాల్లోని భారతీయులను పంపిస్తామంటే ఎలా ఉంటుందన్నారు.
అయితే సీఏఏ అంశంపై బీజేపీ వాదన మరోలా ఉంది. మైనార్టీల ఓట్ల కోసం బీజేపీయేతర ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. అసలు సీఏఏలో మతంతో సంబంధం లేకుండా ఏ భారతీయుడికి ఇబ్బంది లేదని అంటున్నారు. అసలు సీఏఏలో ఏముందో మొదట చదవాలని, మైనార్టీ అప్పీస్‌మెంట్ కోసం రాజ్యాంగ అనుకూల చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని అంటున్నారు.
గల్ప్, అమెరికా సహా విదేశాల్లోని భారతీయులు చట్టబద్దంగా అక్కడ ఉంటున్నారని, భారత్‌లోకి కూడా చట్టబద్దంగా ఏ దేశస్తులు అయినా రావొచ్చునని, కానీ చట్ట వ్యతిరేకంగా దేశంలో అడుగు పెట్టని వారిని ఏ దేశమైనా తిప్పి పంపిస్తుందని, ఇప్పుడు తాము చేస్తోంది అదేనని బీజేపీ నేతల వాదన. చట్ట వ్యతిరేకంగా.. భారత లెక్కలకు దొరకకుండా దేశంలో ఉంటున్న పాక్, బంగ్లా దేశస్తులకు, చట్టబద్దంగా విదేశాల్లో ఉంటున్న భారతీయులకు లంకె పెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు.
పాక్, బంగ్లా, ఆప్గనిస్తాన్‌లు ఇస్లామిక్ దేశాలని, ఆ దేశాల్లోని మైనార్టీలు ఎవరికైనా భారత్‌లో చోటు ఇచ్చేదే సీఏఏ చట్టమని చెబుతున్నారు. అలాగే, ఏ మతానికి చెందినవారైనా భారతీయులకు దీంతో ఇబ్బంది లేదని అంటున్నారు. లెక్కలు, పత్రాలు, అనుమతి లేకుండా దేశంలో ఉంటున్న వారి కోసం విపక్షాలు పోట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇక ఏ దేశానికి చెందినవారైనా 11 ఏళ్ల తర్వాత భారత్‌లో చట్టబద్దంగా పౌరసత్వం పొందే వెసులుబాటు ఉందని చెబుతున్నారు.