జాతీయ మీడియా వాయించాక కేసీఆర్ నోరు విప్పాడు

May 24, 2020

అత్యంత పాశవికంగా.. కిరాతకంగా వెటర్నరీ డాక్టర్ ఉసురుతీసిన నిందితులను తక్షణం శిక్షించాలంటూ జనమంతా హోరెత్తారు. శనివారం ఉదయం ఎవరూ పిలుపునివ్వకుండానే.. స్వచ్ఛందంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రోడ్లమీదకు వచ్చిన ప్రజలు తీవ్ర స్వరంతో తమ నిరసనలు వ్యక్తంచేశారు. నిందితుల సొంత ఊళ్లల్లో సైతం ఆందోళనలు జరిగాయి. పలుచోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. ఇంత జ‌రిగినా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రియాక్ట‌వ‌లేదు. దీనిపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున్నే చ‌ర్చ జ‌రిగింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్క‌డ అంటూ నెటిజ‌న్లు సైతం పెద్ద ఎత్తున్నే ప్ర‌శ్నించారు.

అయితే, ఎట్ట‌కేల‌కు కేసీఆర్ ఈ దారుణ ఘ‌ట‌న‌పై స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేసి... భోజనాల అనంతరం కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి, ఆవేదన చెందారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమావేశం కాబ‌ట్టి వారి విష‌యంలోనూ కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఇదిలాఉండ‌గా, కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ సైతం ప్రియాంక‌రెడ్డి ఘ‌ట‌న‌పై మ‌రోమారు స్పందించారు. దేశంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ), సీఆర్పీసీలను సవరిస్తూ పార్లమెంట్‌లో చట్టం తేవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ``నిర్భయ ఘటన జరిగి ఏడేైళ్లెనా దోషులకు ఇంకా ఉరిశిక్ష పడలేదు. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం ఘటనలో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి కుటుంబానికి మనం ఎలా హామీ ఇవ్వగలం? ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. రేపిస్టులకు అప్పీల్‌కు అవకాశం లేకుండా ఉరిశిక్ష విధించాలి. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారికి శిక్షలు వేగంగా అమలు చేయాలి.` అని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. 

Read Also

అక్కడ మంత్రుల కంటే ఆ వైసీపీ లీడర్ పవర్‌ఫుల్లట
మిగిల్చింది గోరంత.. మింగింది కొండంత
శ్రీల‌క్ష్మి కోసం సాయిరెడ్డి ప్ర‌ద‌క్షిణ‌లు... రీజ‌న్ ఇదే...!