జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదే

May 25, 2020

కొద్దిరోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న అంశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంధం ఒకటి. తెలంగాణలో ఇటీవల ముగిసిన ముందుస్తు ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య బంధం బలపడింది. దీనికి కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే. అంతేకాదు, టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాకూటమి తరపున ప్రచారం చేయడం కూడా. ఈ ప్రచార పర్వం సమయంలో కేసీఆర్.. ఆయనపై చాలా రకాల విమర్శలు చేశారు. అలాగే, టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దీంతో దీనిపై రెండు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ముగిసిన ముందస్తు ఎన్నికల్లో వైసీపీ పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ కూడా వైసీపీకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అందుకే చంద్రబాబు గిఫ్ట్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ బంధం గురించి మరో అంశం తెరపైకి వచ్చింది.

 

 ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలాగో వైసీపీని సపోర్ట్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. అయితే, వీరి సాయం ఏ విధంగా ఉంటుందో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు దీనికి దాదాపుగా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. కేసీఆర్ వెలమ సామాజికవర్గానికి చెందిన వారని అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సామాజికవర్గమే జగన్‌ను గెలిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల్లో కొనసాగుతున్న వెలమ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇది కేసీఆర్ వేసిన స్కెచ్‌లో భాగమేనని సమాచారం. గతంలో ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు వైసీపీ నేతలతో పాటు, కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన చొక్కాకుల వెంకటరావుతో సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే వెలమలంతా వైసీపీ పక్షాన ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారని ప్రచారం జరిగింది. కానీ, అప్పుడు దీనికి వట్టి పుకారు గానే అంతా భావించారు. అయితే, ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుండడంతో జగన్-కేసీఆర్ దోస్తీ వర్కౌట్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సైలెంట్‌గా జరగుతున్న ఈ పరిణామం గురించి తెలిసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. మరి కేసీఆర్.. ఈ ఒక్క స్కెచ్‌తోనే సరిపెడతారా..? లేక ఇంకేమైనా వ్యూహాలు అమలు చేస్తారా అన్నది వేచి చూడాలి.