‘‘సంతోష్.... ఈ స్టాలిన్ కి మన గురించి చెప్పలేదా’’

May 27, 2020

ఎట్టకేలకు కేసీఆర్ స్టాలిన్ అపాయింట్ మెంట్ సంసాదించాడు. నేనివ్వను పోరా అని బహిరంగంగా చెప్పినా...బతిమాలి కలిసిన కేసీఆర్ పై అనేక సెటైర్లు పేలుతున్నాయి. శ్రీనివాస్ ముద్దం అనే నెటిజన్ రాసిన ఈ సెటైర్ అందరిలో బాగా వైరల్ అవుతోంది.

ఈరోజు చెన్నై లో తనపై శాలువా కప్పిన తరువాత కేసీఆర్ స్టాలిన్ తో చెప్పిన మొట్టమొదటి మాట..

కేసీఆర్: "థాంక్ యూ బాయ్ సాబ్. పరువు నిలబెట్టినవ్! కేసీఆర్ కు స్టాలిన్ అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని మా హైదరాబాద్, అమరావతిలలో ఆడోడు ఆడోడు మోపై ఒకటే విమర్శలు. ఇప్పుడిక నేనే కింగ్.
స్టాలిన్: అవును కేసీఆర్ జీ. ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్ నిన్న నాకు ఫోన్ చేశారు. కేసీఆర్ ముచ్చట పడుతున్నాడు కదా. అపాయింట్మెంట్ పడెయ్యు.. అని పర్మిషన్ ఇచ్చారు.

కేసీఆర్: అంటే కాంగ్రెస్ పర్మిషన్ ఇస్తే నాకు అపాయింట్మెంట్ ఇచ్ఛవా స్టాలిన్ భాయ్.
స్టాలిన్: అవును. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెబితే .. ఆ ముక్క అహ్మద్ పటేల్ చెవిలో వేసేస్తా.
(స్టాలిన్ మాట మాటికీ అహ్మద్ పటేల్ ప్రస్తావన తేవడంతో కేసీఆర్ కి చిర్రెత్తుకొచ్చింది )

కేసీఆర్: అరేయ్ సంతోషు .. గీయన గిట్ల మాట్లాడవడుతుండు ఏందిరా. నువ్వు ముందుగాళ్లనే ప్రిపేర్ చెయ్యలేదా. ఏంది?
ఎంపీ సంతోష్ రావు: ఊకొ బాబాయ్. కొంచెం ఓపిక పట్టు. ఆగమాగం చెయ్యకు. ఇది మన హైదరాబాద్ కాదు. మనం ఎట్లా చెప్తే అట్ల ఆడదానికి వీల్లేమైన మన గొర్రెలా ఏంది?
(ఈ సందర్భంలో డీఎంకే మరో నాయకుడు బాలు అందుకున్నాడు)
బాలు: రావుజీ. విషయం చెప్పండి. అసలు మీ ప్రాబ్లెం ఏంటి?
(బాలు వ్యాఖ్యలతో కేసీఆర్ కు మరింత చుర్రుమంది)

కేసీఆర్: ఏయ్ వినోదూ.. వింటున్నావా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ..ఇక్కడ ప్రాబ్లెం ఎవడికుంది? ఇదేనా ఒక సీఎంను పట్టుకొని మాట్లాడే మాటలు?
ఎంపీ వినోద్ : సార్. మీరు ముందు కంట్రోల్ అవ్వండి. అసలు విషయం చెప్పేయండి.

( కేసీఆర్ పురాణం మొదలు పెట్టిండు. కేంద్రం.. రాష్ట్రాలు.. అధికారాలు.. బీజేపీ ..కాంగ్రెస్ .. ఇలా గంట గడిచిపోయింది. చివర్లో ఫెడరల్ ఫ్రంట్, దానికి కేసీఆర్ నాయకత్వం.. డీఎంకే మద్దతు.. అన్ని చెప్పేసాడు. ఆయన చెప్పడం అయిపోయాక స్టాలిన్ లేచి నిలబడ్డాడు )

కేసీఆర్ : స్టాలిన్ భాయ్. ఇక మనిద్దరం ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టేద్దామా? (ఆశగా అడిగాడు కేసీఆర్ )

స్టాలిన్: కేసీఆర్ జీ.. నీకు వచ్చే ఎంపీ సీట్లు 14 (బాగా వస్తే). నాకు వచ్చేవి 30. అంటే నీకంటే డబుల్. ప్రధాని కావాలనే ఆశ నాకే లేదు. 14 తో నువ్వేం పీకుతావ్?
సక్కగా హైదరాబాద్ వెళ్ళిపోయి నీ పనేదో నువ్వు చేసుకుని బతుకు. ఇట్ల ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకుని రోజుకొక్కని వెంబడ పడుడు మానెయ్. నడు.. ఇంకా ప్రెస్ మీటట..ప్రెస్ మీట్. !
అరేయ్.. సెక్యూరిటీ .. ఇటు రార్రా.
(కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు స్టాలిన్. ఇక కేసీఆర్ పరిస్థితి దారుణం. నేను చెప్పలేను.. మీరే ఊహించుకోండ్రి)

ఈ సెటైర్ సోషల్ మీడియాలో అందరూ తెగ షేర్ చేసుకుంటున్నారు.