అయోధ్య కి  కేసీఆర్ వ్యతిరేకమా? - ఆధారాలు చూపిన ఫైర్ బ్రాండ్

July 14, 2020

అయోధ్య తీర్పు యావత్ దేశానికి ఆసక్తిని రేకెత్తించింది. నిరంతరం అతివాద ముస్లిం పార్టీ, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎం భజన చేసే మన కేసీఆర్ కి ఈ తీర్పు ఏమనిపించింది అనేది సరైన సందేహమే. ఆయనకు ఎంత నొప్పి కలిగిందో మరి... మౌనంగా ఉన్నారు. ఇదీ కేసీఆర్ అసలు స్వరూపం అంటూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయశాంతి కేసీఆర్ ను ఉతికారేసింది. ఓట్ల రాజకీయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ స్పందించకుండా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీనివెనుక చాలా పెద్ద మతలబు ఉందన్నారు. మజ్లిస్ ఒంటి ీమద దెబ్బ తగిలితే కేసీఆర్ కంట్లో నీళ్లొస్తాయని... దేశానికి ఏం జరిగినా పర్లేదు, మజ్లిస్ పార్టీ సంతోసంగా ఉండటమే కేసీఆర్ కు ఇంపార్టెంట్ అని ఆమె వ్యాఖ్యానించారు. 

కావాలంటే... గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చూడండి. నేను చెబుతున్నదాంట్లో నిజమెంతో మీకు తెలుస్తుంది అంటూ ఒక ఆధారాన్ని కూడా జతచేసింది. అది ఒక పాత వీడియో. ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్టులో ఏముందంటే...

‘‘తాను హిందువు అని గుర్తుచేయడానికి మాత్రమే కేసీఆర్ పూజలు చేస్తారని, లేకపోతే మజ్లిస్ పట్ల దోస్తీపై అనుమానాలు వస్తాయని భయపడి పూజలు చేస్తారని, .. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉండకపోతే కేసీఆర్ ఇంత మంచి వార్త విన్నాక కూడా ఎలా సైలెంటుగా ఉండగలరని?’’ ఆమె అనుమానం వ్యక్తంచేశారు.  రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని... అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనంగా ఆమె వ్యాఖ్యానించారు. అయోధ్య అవసరం లేదని కేసీఆర్ భావన అందుకే ఈ తీర్పు నచ్చక... ఏమీ మాట్లాడటం లేదు అని వ్యాఖ్యానించారు . దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు... వీడియో చూస్తే మీకన్నీ అర్థమవుతాయి’’ అన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.