ఘనంగా కీరవాణి కాన్సెర్ట్ - ఓలలాడిన ఎన్నారైలు

August 07, 2020

వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన 22వ తానా మహాసభలు శనివారం సాయంత్రం కీరవాణి సంగీత విభావరితో ఘనంగా ముగిశాయి. తానా ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్  తదుపరి బాధ్యతలను తాళ్లూరి జయశేఖర్‌కు అప్పగించడంతో ఈ సమావేశాల్లో కీలక ప్రధాన ఘట్టం ముగిసింది. తన సరిగమలతో అమెరికా సాయంత్రాన్ని కీరవాణి ఆహ్లాదమయం చేశారు. కీరవాణి విభావరి తానా కార్యక్రమాల్లో హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు.