కీర్తి సురేష్ పెళ్లి పుకార్ల వెనుక అతను

August 04, 2020

ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్. రెండేళ్ల కిందట ‘మహానటి’ సినిమాతో ఆమె ఎంత గొప్ప పేరు సంపాదించిందో.. తన ఇమేజ్‌ను ఎంతగా పెంచుకుందో తెలిసిందే. ఆ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌ను బాగానే నడిపిస్తోంది కీర్తి.

ఐతే కీర్తికి ఇంకా బోలెడంత కెరీర్ ఉందని అందరూ భావిస్తుండగా.. కేరళకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడబోతోందని రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ న్యూస్ అథెంటిక్కే అన్న అభిప్రాయం జనాల్లో కలిగింది. ఐతే ఈ వార్తలపై వెంటనే స్పందించిన కీర్తి.. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధమని స్పష్టం చేసింది. తాను సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నానని.. మరి పెళ్లి ఎలా చేసుకుంటానని ఆమె ప్రశ్నించింది. ఊరికే వార్తల్ని కొట్టిపారేయడం కాకుండా కీర్తి చాలా సీరియస్‌గానే స్పందించింది.

ఆమె ఆగ్రహానికి కారణం.. ఈ వార్తల్ని తమిళ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పుట్టించడమేనట. ఆ వ్యక్తి కమెడియన్ సురేష్ అన్నది తమిళ మీడియా వర్గాల సమాచారం. సంతానం హవా తగ్గాక తమిళంలో బాగా పాపులర్ అయిన కమెడియన్లలో సతీష్ ఒకడు. కీర్తి కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో సతీష్‌తో సన్నిహితంగా ఉండేది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

కానీ తర్వాత కీర్తి రేంజ్ మారిపోయింది. ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ మధ్య సతీష్‌ను కీర్తి అస్సలు పట్టించుకోవడం లేదని.. ఈ నేపథ్యంలోనే అతను ఆమె గురించి మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి దుష్ప్రచారం చేయించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సతీష్‌కు కీర్తి ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తమిళ మీడియా చెబుతోంది.