అద్దె కోసం వేధించొద్దు

August 11, 2020

ఢిల్లీ మఖ్యమంత్రి మరోసారి పేదల మనసు దోచాడు. సామాన్యుడికి ఉపయోగపడే సంస్కరణలు తేవడంలో చిత్తశుద్దితో పనిచేసిన కేజ్రీవాల్ కరోనా సమయంలోను వారి పట్ల ఉదారత చూపి మనసు దోచుకున్నారు. ప్రభుత్వ పరిధిలో వారికి చేయాల్సిన సాయమంతా చేసిన కేజ్రీవాల్ తన పరిధికి మించి వారి కోసం ఢిల్లీ ప్రజలకు ఓ విజ్జప్తిని చేశారు.

ఢిల్లీలోని ఇళ్ల యజమానులు సామాన్యుల పట్ల దయచూపి ఈ నెల అద్దె కోసం బలవంతం చేయొద్దని కోరారు. ఇది నా వ్యక్తిగత విజ్జప్తి అని అన్నారు. చాలామంది సామాన్యులు రోజు సంపాదించి బతుకుతుంటారు. వారికి ఇపుడు ఉపాధి లేదు. తిండికే గడవడం కష్టం కావచ్చు. కాబట్టి అద్దె వసూలును వాయిదా వేయాలని కోరారు.

ఈ నెల అద్దెను వాయిదాల్లో కట్టుకునే అవకాశం ఇవ్వాలని కరోనా తగ్గిన తర్వాత వారు తిరిగి ఉపాధి పొందాక మెల్లగా మీ అద్దె చెల్లించే వెసులు బాటు కల్పించాలని కోరారు. సాటి పౌరుడిగా కష్టంలో ఉన్నవారిని ఆదుకోమని మీకు మీలో ఒకడిగా విజ్జప్తి చేస్తున్నాను అన్నారు కేజ్రీవాల్.