బీజేపీయేతర సీఎంలకు మోడీ ఝలక్...

August 07, 2020

లాక్ డౌన్ సడలింపులు కేజ్రీవాల్ కి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒకవైపు దేశంలో, రాష్ట్రంలో కేసులు పెరుగుతుంటే... ఈ సడలింపులు ఇవ్వడం ఏంటని కేజ్రీవాల్ అసహనం వ్యక్తంచేస్తున్నారు. కరోనా అదుపులోకి రాకముందే ఇలా సడలింపులు ఇస్తే... అది మంచిది కాదని, కేసులు పెరిగే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ వాపోతున్నారు. రిజిస్టర్ అయిన దుకాణాలు శనివారం నుంచి తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవాం అర్ధరాత్రి ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఇందులో ఓ మెలిక పెట్టింది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. 

అంటే లాక్ డౌన్ తో ఇబ్బందులు పడేవారి వల్ల తనకొచ్చే చెడ్డపేరును స్థానిక ప్రభుత్వంపై కేంద్రం మళ్లిస్తోంది. ప్రజలు ... కేంద్రం అవకాశం ఇచ్చినా రాష్ట్రం ఒప్పుకోలేదు అని నింద వేస్తారు. అది లాజికల్ గా స్థానిక ప్రభుత్వానికి దెబ్బ. ఎందుకంటే కేసులు పెరుగుతుండగా అనుమతులు ఇస్తే ఆ తలనొప్పి భరించాల్సింది, కేసులు ఎక్కువైతే ఒత్తిడి భరించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వాలే. అందుకే కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అసలే రంజాన్ కావడం వల్ల బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు ఇది తలనొప్పిగా మారనుంది.

ఢిల్లీలో ఇదే జరిగింది. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, అందుకే కేంద్రం ఆదేశాలు అమలుచేయడం లేదని, లాక్ డౌన్ లో ఏ సడలింపులు ఇవ్వడం లేదని కేజ్రీవాల్ సర్కారు పేర్కొంది. 27 వరకు నిర్ణయం మారదు అని, ఆ తర్వాత పీఎం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన అనంతరం సడలింపుల గురించి ఆలోచిస్తాం అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ పరిస్థితే కేసీఆర్ తదితర నాయకులకు ఇబ్బందిగా ఉంది. జగన్ వంటి వారు దీనిని వాడుకుంటున్నారు. 

ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాగూ మెజారిటీ తమ వైపు ఉండేవారు కాబట్టి స్థానిక ప్రభుత్వాలు ఇబ్బంది పడినా... దేశ వ్యాప్తంగా మోడీ డ్యామేజ్ కావడం కంటే లోకల్ లీడర్లు డ్యామేజ్ కావడం బెటరే కదా అనుకుంటోంది బీజేపీ.