కేజ్రీవాల్ కీలక నిర్ణయం

August 13, 2020

ఆమ్ ఆద్మీ పార్టీ అని నామకరణం చేసి అది నామ్ కే వాస్తి కాకుండా నిజంగా ఆమ్ ఆద్మీని పట్టించుకున్న నేత కేజ్రీవాల్. పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ఉచిత పథకాలు ఇచ్చినా ప్రయోజనకరంగా ఇచ్చారు. సామాన్యుడు ప్రభుత్వం నుంచి కోరుకునేవి మూడు... బడి, ఆస్పత్రి, రవాణా. ఈ మూడు ప్రభుత్వం ఇస్తే... మిగతా బతుకు తాను బతకగలడు. ఈ సూక్ష్మం తెలుసుకున్న కేజ్రీవాల్ ఆ బాటలో నడిచారు. దేశంలో ఎవరూ నమ్మలేనంత గొప్పగా స్కూళ్లను తీర్చిదిద్దాడు. మంచి ఫలితాలు సాధించారు. అందుకే ప్రజలు మళ్లీ ఆయనకు పట్టం కట్టారు.

ఇదిలా ఉండగా... తాజాగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం నుంచే తాను సామాన్యుడిని మనిషి అని డిసైడ్ చేశారు. సాధారణంగా ఎక్కడ దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసినా... తమకు పరిచయం ఉన్న ముఖ్యమంత్రులను ప్రముఖులను ఆహ్వానిస్తారు. దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న కేజ్రీవాల్. తనను గెలిపించిన ఢిల్లీ ప్రజలే నాకు వీఐపీలు. వారందరినీ నా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నాను అని పార్టీ తరఫున ప్రకటించారు. ఇతర రాష్ట్ర ప్రముఖులను ఎవరినీ ఆహ్వానించడం లేదు. కేవలం ఢిల్లీ ప్రజలు మాత్రమే ఆహ్వానితులు. ఈ ప్రమాణ స్వీకారం 16 వ తేదీన రాంలీలా మైదానంలో జరగనుంది.