కేరళ ఐడియా అదిరింది...

August 08, 2020

కేరళ ట్యాక్సీ : కోవిడ్ పోరులో దేశంలో కేరళ రాష్ట్రం అన్ని విషయాల్లో ముందంజలో ఉంది. బ్రేక్ ద చైన్ ప్రోగ్రాం ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేరళ అతి తక్కువ కేసులతో, అతి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుతం అక్కడ కేవలం 20 కేసులు మాత్రమే ఉన్నాయి. 

తాజాగా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడంలో భాగంగా... తగిన చర్యలను తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తున్న ఎన్నారైలను తరలించడానికి క్యాబులను ప్రత్యేకంగా తయారుచేేసింది. ఒకరి నుంచి ఇంకొకరిక కరోనా సోకుండా డ్రైవరు, ముందు సీటు, వెనుక సీటులాగా మూడు భాగాలుగా విభజించింది. 

ఒకరి నుంచి ఒకరిని వేరు చేయడానికి ట్రాన్సపరెంట్ ప్లాస్టిక్ తెరలను ఏర్పాటుచేసింది. దీనివల్ల ఒకరి తుమ్మినా, దగ్గినా వారి వల్ల ఇతరులకు ప్రమాదం ఉండదు. కోవిడ్ వైరస్ ను పూర్తి తరిమేయడం అంతు సులువు కాదని తేలిపోయిన నేపథ్యంలో ఇక మన పనులు మనం చేసుకుంటూనే అది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న కోణంలో ప్రయత్నం చేస్తోంది కేరళ.

బస్సులను కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తోంది. మునుపటితో పోలిస్తే జీవితం కఠినంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. తప్పదు. కోవిడ్ పై ఈ పోరాటం చేయాల్సిందే. దానికి కనిపిస్తూనే దానిపై పై చేయి సాధించక తప్పదు. ఈ విషయంలో కేరళను అందరికీ స్ఫూర్తిగా తీసుకోవాలి.