​సాయిరెడ్డి రెండు చెంపలు వాచిపోయాయిగా !

February 19, 2020

బాస్ ఒక ఎంప్లాయిని కొడితే... అతను బాస్ ని కొట్టలేక పెళ్లాన్ని కొట్టినట్టుంది విజయసాయిరెడ్డి వ్యవహారం. కన్నాలక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, విష్ణు వంటి వారు బండబూతులు తిడుతుంటే... వారిని ఏమంటే... ఏం జరుగుతుందో అని టీడీపీపై పడి ఏడుస్తారు రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డి. తాజాగా అమరావతి విషయంలో అనుమానాలు కలిగించింది బొత్స. ఆ తర్వాత ఖండించింది బొత్స. కానీ అమరావతిని మారుస్తామంటే కేశినేని నాని, చంద్రబాబు, సుజన ఏడుస్తున్నారు అంటూ సంబంధం లేని విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. పొద్దున లేస్తే... చంద్రబాబును తిట్టడం ద్వారా ఆ రోజును పూర్తిచేసే సాయిరెడ్డిని తన మాటలతో సుజనా తీవ్రంగా అవమానిస్తూనే ఛాలెంజ్ విసిరారు. మరోవైపు టీడీపీ నేత నాని కూడా సాయిరెడ్డికి గట్టి ఛాలెంజ్ విసిరారు.
‘‘మీ చౌకబారు ట్వీట్లకు స్పందించాల్సి వస్తుందని ఇప్పటివరకు అనుకోలేదు.1910 నుంచి 2010 మధ్యలో వంశపారంపర్యంగా, ఇతరత్రా జరిగిన రిజిస్ట్రేషన్లు మినహా నాకు, నా కుటుంబానికి అమరావతిలో సెంటు భూమి వుందని నిరూపిస్తే అప్పుడు తగిన విధంగా స్పందిస్తా. మీ పదవి ప్రతిష్ఠను దిగజార్చకండి ’’ అని సింపుల్ గా సాయిరెడ్డి రెండు చెంపలు వాయించారు.
మరోవైపు నాని కూడా ఏం తక్కువ తినలేదు. సాయిరెడ్డికి తేరుకోెలేని సవాల్ విసిరారు. అమరావతిలో నాకు భూములు ఉన్నాయని వైసీపీ గవర్నమెంటు నిరూపిస్తే... దానిని వైసీపీ గవర్నమెంటుకే రాసిస్తాను. ఒకవేళ అక్కడ నాకు లేవని తేలితే మీరు ఏం చేస్తారో చెప్పి సవాల్ స్వీకరించండి అంటూ సాయిరెడ్డికి గట్టి కౌంటర్ వేశారు నాని. అలా ఇద్దరు నేతలు చెరో చెంప వాయించి వదిలిపెట్టారు సాయిరెడ్డిని... మరి ఆయన దీనికి ఏం స్పందిస్తారో చూడాలి.