నాని మళ్లీ చెలరేగిపోయాడు

September 16, 2019
కేశినేని నాని అస్సలు బయటకు రావడం లేదు. ఆయన ఫేస్ బుక్ ముందు నుంచి కదలనట్టు ఉంది ఇంకా. రోజుకొకపోస్టు పెడుతూ ఫేస్ బుక్ పులిగా మారారు. ఇప్పటికే ఉన్న కన్ఫ్యూజన్ చాలదన్నట్టు ఆయన తాజాగా  మరోపోస్టు పెట్టారు. ఎవరెన్ని విపరీతార్థాలు తీసినా తాను లెక్కచేయను అన్నాడు. అయినా... ఏదైనా అర్థమయ్యేట్టు విపతీర్థాలు ఎందుకు తీస్తారు నాని గారు... మీరు చెప్పేదేదో నేరుగా చెప్పండి. జనం అర్థం కాక చస్తున్నారు. మీరు పార్టీ మారతారని అయితే ప్రచారం జరగుతోంది. ఖండించడమో, అంగీకరించడమో చేయాలి కదా.
ఇంతకీ ఆయన తాజాగా  ఏమన్నాడో చెప్పలేదు కదా.  ఇదే ఆయన పోస్టు

నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు.

నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.

నిజాన్ని నిజమని చెబుతాను.
అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.

మంచిని మంచి అనే అంటాను.
చెడును చెడు అనే అంటాను.

న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను.
అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని.

నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను.
నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని.

భయం నా రక్తంలో లేదు.
రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.

ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు.

 

దీనికి జనం రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు వాటిలో కొన్ని...

 

Papolu Narasimha Rao ఓకే అది మీ వ్యక్తిగతం ఇప్పుడు అందరూ మీరు టిడిపి లో ఉంటారా లేక బిజెపి లో కి వేళ్తారా అదే అందరికీ ఉన్న అనుమానం ఒకవేళ మీరు టిడిపి వదిలి బిజెపి లో join అయితే మాత్రం టీడీపీ కీ రాజినామ చేసి అప్పుడు మీ నిజాయితీ నీరూపించుకొండి 

Pavan Kumar మరి పార్టీ అధికారం లో ఉనప్పుడు ఏమైంది ఈ ఆవేశం ఈ నీతి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం . కష్టకాలం లో ఉనప్పుడు పార్టీ కి ఉపయోగపడకపోయిన పర్లేదు పార్టీ ని దెబ్బతీయటం మంచిది కాదు

NagaRatnam Atturu అంటె మీరు చెప్పేది చంద్రబాబు దయాదాక్ష్యీణాలు మీద గెలవలేదు అంటున్నారా మంచిదే అయినా ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్వీట్లు ఎందుకు మీరు పార్టీ మారాలిఅనుకుంటే మారండి మీ రాజినామా కూడా పార్టీ అడగదు ఎంతోమంది వెళ్ళారు అందులో మీరు ఒకరు అంతే 

Sankar Bejawada మేముఅందరం తెలుగుదేశం పార్టీకోసం కష్టపడి పనిచేశాం ఎవ్యక్తి కోసం పనిచేయలేదు పార్టీ ప్రాణం తీసుకోమంటే ప్రాణం తీసుకుంటాం మాకు పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు 

Krishna Satish వ్యక్తిగతంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు కానీ ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవిలో ఉంటూ నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే correct కాదేమో sir... మీరు పార్టీ మరటానికి ఇదంతా చేస్తున్నారని అనుకుంటున్నారు...అదే నిజమయితే మీరు MP గా రాజీనామా చేసి వెళ్తారా లేక చెయ్యకుండా వెళ్తారా అనేదాన్ని బట్టి పైన మీగురించి మీరు చెప్పుకున్న మాటలు నిజమో కాదో తెలుస్తుంది... మాటల కంటే చేతలకే విలువెక్కువ కదా... 

శ్రీనివాస్ నూతక్కి. మరి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, EVM లకి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్యాలెట్ కోసం పట్టుపట్టండి. తెలుస్తుంది మోడీ మీద తమరి పోరాటం 

Rajkumar Thanigachalam You are a very good actor sir