ఒక్క ట్వీట్... జగన్ బ్యాచ్ సైలెంట్

July 05, 2020

వంద తిట్ల క‌న్నా.. అదిరే ఒక వ్యంగ్యం ఎఫెక్ట్ మామూలుగా ఉండ‌దు. ఈ విష‌యాన్ని రాజ‌కీయ నేత‌లు అర్థం చేసుకున్న‌ట్లున్నారు. గ‌తంలో మీడియా ముందుకు వ‌చ్చి.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌టం.. తిట్ల దండ‌కాన్ని అందుకోవ‌టం లాంటివి చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై త‌మ‌కున‌న ఆగ్ర‌హాన్ని.. వారు చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపేందుకు వ్యంగ్యాన్ని ఎంచుకుంటున్నారు.
ఫుల్లీ లోడెడ్ గ‌న్ మాదిరి వారు ట్వీట్ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇందుకు వాస్త‌వ గ‌ణాంకాల‌తో పాటు కాసింత ఎట‌కారాన్ని రంగ‌రించి వ‌దులుతున్న పోస్టులు వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ కోవ‌లోకే వ‌స్తారు విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ అధినేత తీరు మొద‌లు.. ప్ర‌త్య‌ర్థిపార్టీ తీరును త‌ప్పు ప‌డుతూ ఆయ‌న త‌ర‌చూ వార్త‌ల్లో త‌ళుక్కుమంటున్నారు.
గ‌తానికి భిన్నంగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో మ‌హా హుషారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌రుస ట్వీట్ల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ చూస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఊపిరి ఆడ‌న‌ట్లుగా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేంద్రం మెడ‌లు వంచి రాష్ట్రానికి బ‌డ్జెట్ లో రూ.21 కోట్లను సీఎం జ‌గ‌న్ తెచ్చార‌న్నారు.
ఇంత ఘ‌నత సాధించిన జ‌గ‌న్‌.. ఆయ‌న 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 22 మంది ఎంపీలున్న లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్ లో మోడీ స‌ర్కారు కేవ‌లం రూ.21 కోట్లు కేటాయించార‌ని పేర్కొన‌టం ద్వారా.. అంత‌మంది ఎంపీలున్నా.. జ‌గ‌న్ ఏమీ సాధించ‌లేక‌పోయార‌న్న పంచ్ వేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.