జగనన్నా... నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావ్

February 25, 2020

జగన్ నిర్ణయంపై మూడు జిల్లాల ప్రజలు మండిపోతున్నారు. అమరావతి తరలిపోతే తాము రోడ్డుపాలవుతామని అమరావతి రైతులు, నష్టపోతామని కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు ఆవేదన చెందతున్నారు. అయితే వారు తమ ఆవేదనను ఉద్యమ రూపంగా మార్చడంలో తీవ్రంగా విపలమవుతున్నారు.

ఆందోళనకారులకు మద్దతు పలకాల్సిన పార్టీలు కూడా అమరావతి రైతుల చుట్టు తిరుగుతుండటంతో సమస్య వారికే పరిమితం అన్నట్టు ఉంది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ప్రతి ఒక్కరూ జగన్ నిర్ణయానికి ప్రభావితం అవుతున్నారు. ఇకపోతే దీనిపై తెలుగుదేశం నేత కేశినేని నాని జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఈరోజు ఆందోళనకు తరలివస్తున్న నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. 

విజయవాడలోని తన ఇంట్లో పోలీసులు చుట్టుముట్టి ఉన్న విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా ఆయన వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో పాల్గొనకుండా పోలీసులు తనను నిర్బంధించినట్లు చెప్పిన నాని... జగన్ ను హెచ్చరించారు. ’’జగన్ అన్నా.. ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు. అమరావతి నుంచి రాజధాని మార్చి నీ గోయి నువ్వు తవ్వుకోవద్దు’’ అంటూ ట్విట్టరులో హెచ్చరించారు.