కొడాలి నాని దేవినేనికి రుణపడి ఉన్నాడట

May 23, 2020

ఇది బ్రేకింగ్, షాకింగ్ న్యూస్ కానీ... అన్నది మాత్రం కొడాలి నాని కాదు, దేవినేనీ కాదు... వారిద్దరూ అనకపోతే ఈ మాట అనే అవసరం ఇంకెవరికి ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? తెలిసిందేగా ఇటీవల ఓ టీడీపీ నేత తీవ్ర అయోమయంలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని విధంగా, పార్టీలో ఉండాలో పోవాలో తేల్చుకోలేని విధంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే కదా. ఆయనే కేశినేని నాని. కొంతకాలంగా ఆయన ఫేస్ బుక్ ముందు కూర్చుని కదలడమే లేదు. మొత్తం రాజకీయం ఫేస్ బుక్ నుంచే నడిపిస్తున్నారు. తాజాగా ఇంకోటి పేల్చాడు.
"కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!" ఇది కేశినేని నాని పోస్ట్. ఈ పోస్ట్ వెనుక అర్థం పరమార్థం ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థమయ్యేలా లేదు. అసలు ఆయన ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నారో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక చంద్రబాబు కూడా ఒకసారి చెప్పి చూసి నాని ఇష్టానికి వదిలేశారు. మినిమమ్ మెచ్యూరిటీ లేకుండా చేసే పోస్టుల వల్ల ఎవరికి లాభం? ఆయనకు నష్టం తప్ప. రెండోసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి వ్యవహరించాల్సిన తీరేనా ఇది అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది.
కేశినేని నాని అభిమానులు ఆయనకు చెప్పాలో వద్దో తెలియక తలపట్టుకున్నారు. తమ నాయకుడు ఎందుకు హుందాగా ప్రవర్తించకుండా ఇలా సిల్లీ పోస్టులు పెడుతున్నారో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే... ఈ పోస్టు కొడాలి నానికి పాజిటివ్ గా కనిపించినా... వాస్తవానికి కాదు. బలహీన అభ్యర్థి ఉండటం వల్ల కొడాలి నాని గెలిచినట్లు ఇది అర్థాన్నిస్తుంది గాని కొడాలి నాని టాలెంట్ వల్ల గెలిచినట్లు లేదు. అంటే దేవినేని వ్యవహారం వల్లే కొడాలి గెలిచినట్లు కేశినేని ప్రచారం చేస్తున్నాడు. మరి ఇది ఒకరకంగా కొడాలికి ఇన్ సల్టేగా. మరి దీనికి కొడాలి నాని ఏమని స్పందిస్తారో చూడాలి.