ఆ ఫస్ట్ లుక్ లో బట్టలిప్పేసింది ఈ అమ్మాయే

January 25, 2020

పూరీ జగన్నాథ్ ఎవరెవరికో బ్లాక్ బస్టర్లు ఇస్తాడు గాని తన కొడుక్కి, తమ్ముడికి ఇవ్వలేకపోతున్నాడు. ఇచ్చాడులే అప్పట్లో అనడానికీ లేదు. ఎందుకంటే... లేటెస్ట్ గా రామ్ కెరీర్ లో నిలిచిపోయే సినిమాను ఇచ్చాడు. మరి కొడుకు వద్దకు వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తున్నాడు. అన్నీ తెలిసినోడు అడుక్కు తిన్నట్లు ఉంది పూరీ పరిస్థితి. చిన్నప్పుడు అనేక సినిమాల్లో నటించిన కొడుకు మెహబూబాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అది ఫ్లాప్ గా నిలిచి ఇబ్బంది పెట్టింది. దాంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆకాష్. 

తాజాగా యూత్ కి పిచ్చెక్కించే సినిమా తీస్తేనే కొడుక్కి కెరీర్ అనుకున్నాడో ఏమో... ఇతరులను దర్శకుడిగా పెట్టి... హై డోస్ రొమాంటిక్ ఫిల్మ్ తీసెయ్... డబ్బు సంగతి నేను చూసుకుంటాను అంటూ నిర్మాత చైర్లో కూర్చున్నాడు. అనిల్ పాడూరి అనే దర్శకుడి చేతిలో ఆకాష్ ను పెట్టేశాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయ్యి... ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. చాలా బోల్డ్ గా టాప్ లెస్ (బ్యాక్) తో ఉన్న అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్న ఆకాష్ స్టిల్ అది. ఆ పోస్టురుతో టాలీవుడ్ పిచ్చెక్కిపోయింది. ఎక్కడ పట్టారు ఈ పోరిని అంటూ ఎంక్వయిరీలు మొదలయ్యాయి. 

టాప్ లెస్ బ్యాక్ తో ఆకాష్ ను చుట్టేసిన ఆ అదిరే ఫిగరు కేతిక శర్మ. ఆ అమ్మాయి... ఏదో సాధారణ ముంబై అందగత్తె మాత్రమే కాదు. చాలా హిస్టరీ ఉందా పిల్లకు. మోడల్, సింగర్ అన్నిటికి మించి యూట్యూబర్ గా అనేక మందిని ఆకట్టుకుంది తన టాలెంట్ తో. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. డబ్ స్మాష్ వీడియో క్లిప్స్ తో బాగా ఫేమస్. ఇంకా హీరోయిన్ కాకనే ఎంత ఫేమస్ అంటే... ఇన్ స్టాలో 12 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మిగతా వాటిలో కూడా ఏం తక్కువ ఫాలోయింగ్ లేదు. దీనికి ఆమె టాలెంట్ మాత్రమే కారణం కాదు... అదిరిపోయే ఆమె అందాలు కూడా ప్రధాన కారణం. ఆ అందాల విందును ఆమె మీకోసం అందిస్తోంది. 

 

Read Also

గ్రామ సచివాలయ వ్యవస్థ అవసరమా జగన్... సీనియర్ క్వశ్చన్
అమెరికా లో మోడీ - ట్రంప్ బహిరంగ సభ లో  నిరసన 
ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ బదిలీ వెనక 1350 కోట్ల స్కాం?