అచ్చెన్న అరెస్ట్‌లో కొత్త ట్విస్ట్‌లు: ఆ డబ్బులు ఇచ్చిందే జగన్ ప్రభుత్వం ?

August 03, 2020

ఈఎస్ఐ స్కాం-మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నయుడి అరెస్ట్ కేవలం కుట్రపూరితమేనా? అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు. ఈ స్కాంలో రూ.100 కోట్లు... రూ.150 కోట్ల అవతకవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఐతే రిమాండ్ రిపోర్టులో ఈ కేసుకు సంబంధించి రూ.3 కోట్ల అవకతవకలు పేర్కొనడం గమనార్హం.

ఇక్కడ మరో షాకింగ్ అంశం కూడా ఉంది. ఈ కేసుకు కీలకంగా మారిన టెలి హెల్త్ సర్వీసెస్‍‌కు రూ.3 కోట్ల బకాయిలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించిందట. అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇచ్చిన లేఖ ఆదారంగా దాదాపు రూ.8 కోట్ల విలువైన పనులను టెలి హెల్త్ సర్వీసెస్‌కు అప్పగించారని వైసీపీ చెబుతోందని, కానీ ఆ సంస్థకు తమ ప్రభుత్వం హయాంలో చెల్లింపులు జరపలేదని, జగన్ ప్రభుత్వం వచ్చాకే రూ.3 కోట్లు చెల్లింపులు జరిపిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

అసలు ఈ అంశంపై గత చంద్రబాబు ప్రభుత్వమే విచారణకు ఆదేశించిందని, ఓ వైపు విచారణకు ఆదేశించగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఎలా చెల్లించిందని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. అవకతవకలపై గత ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే చెల్లింపులు జరిపిన జగన్ ప్రభుత్వంపై, సిఫార్సు చేసిన వైసీపీ నేతలపై కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది రూ.100 కోట్లు లేదా రూ.150 కోట్ల స్కాం కాకపోవడం, ఈ ఘటనపై చంద్రబాబు హయాంలోనే విచారణకు ఆదేశాలు జరపడం, విచారణకు ఆదేశించినప్పటికీ ఈ ప్రభుత్వం రూ.3 కోట్లు చెల్లింపులు జరపడం, రిమాండ్ రిపోర్టులోను రూ.3 కోట్ల దుర్వినియోగం స్పష్టంగా పేర్కొనడం.. వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని, కేవలం కక్షపూరితంగానే అచ్చెన్నను అరెస్టు చేశారని తేటతెల్లమవుతోందని అంటున్నారు.

అచ్చన్న లేఖ రాసినట్లుగా కూడా వైసీపీ చెబుతోంది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఏపీలో జరిగినట్లుగానే తెలంగాణలో కూడా జరిగిందని, కానీ అక్కడ మంత్రిని అరెస్టు చేయలేదని, కానీ ఏపీలో మాత్రం అచ్చన్న లేఖ ఇచ్చాడనే ఓ సాకు చూపి మాత్రమే అరెస్టు చేశారని, కానీ ఎక్కడా ప్రయోజనం పొందినట్లుగా లేదని గుర్తు చేస్తున్నారు.