జగన్ తెలివికి కొమ్ములు తిరిగిన నేతలే ఫిదా అవుతారు

August 03, 2020

మాయ కాదు, మంత్రం కాదు.. 

అటుది ఇటు మార్చు, ఇటుది అటు మార్చు

ఫైనల్ గా పథకం పేరు మార్చు.

ఇది ఏపీలో జగనన్న సృష్టించిన కొత్త ట్రెండ్

జగన్ తెలివితేటలకు నలభై ఏళ్ల బాబు అనుభవం విస్మయం చెందుతోంది. తండ్రి ఆత్మే షాక్ తింటోంది. అసలు డబ్బులు ఇలా కూడా మిగల్చొచ్చని కనిపెట్టిన జగన్ తెలివితేటలను అభినందించకుండా ఉండలేం. అందుకే దేశంలో సుమారు 30 రాష్ట్రాలున్నా... ఇంతవరకు వందలాది ముఖ్యమంత్రులు దేశ వ్యాప్తంగా ఉన్నా... ఏ ముఖ్యమంత్రి కొడుకు లేనంత సంపద జగన్ సంపాదించాడు అంటే ఇలాంటి తెలివితేటలే దానికి కారణం. జగన్ కు ఉన్నన్ని కంపెనీలు మరే ఇతర సీఎం కొడుక్కి ఎందుకు లేవు. అది సామాన్యమైన బుర్ర కాదు..

ఇక్కడ ప్రశంసిస్తున్నది జగన్ ని కాదు, అతని వ్యూహాలను.

జగనన్న విద్యా దీవెన పథకం పెట్టిన సందర్భంగా వైసీపీ చేస్తున్న ప్రచారం చూస్తే ... జగన్ గత ప్రభుత్వాల కంటే తండ్రి కంటే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు అని భావన కలుగుతుంది. అదే ఈ పథకం గొప్పతనం. వాస్తవానికి కాలేజీలకు స్వేచ్ఛ ఉన్న ఈ పథకంలో అందరు విద్యార్థులకు పథకం అందేది... జగన్ వేసిన ప్లాన్ తో కాలేజీలకు డబ్బులు ఏం తగ్గవు. కానీ తనకు నచ్చని కులం విద్యార్థులకు, తనకు నచ్చని పార్టీ విద్యార్థులకు ఈ డబ్బులు అందకుండా ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీయడమే దీని లక్ష్యం. అదెలాగో సులువుగా అర్థమైతే ఆయన జగన్ ఎందుకు అవుతారు.

ఇంతకుముందు కాలేజీలు ఈ ఫీజు బాధ్యతను చూసుకునేవి. ఇపుడు వాటికి సంబంధం లేదు. జగన్ నచ్చిన కాలేజీలకు ఎక్కువ ఫీజులు ఫిక్స్ చేస్తారు. నచ్చని కులం కాలేజీలకు తక్కువ ఫీజు ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా తన వారు బాగుపడతారు. ఇక విద్యార్థులకు నేరుగా ఇవ్వడం ద్వారా... అనేక కారణాల వల్ల కులం, పార్టీ పేరు చెప్పి అర్హులను తగ్గిస్తారు. దీనివల్ల ’’ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అలియాస్ జగనన్న విద్యా దీవెన‘‘ అనే ఈ పథకం గత ప్రభుత్వం కంటే తక్కువ నిధులతో నడుస్తుంది. తద్వారా నచ్చని వాళ్లని అణిచివేసి పార్టీ సానుభూతి పరులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు... తన పార్టీకి విధేయులను తయారుచేస్తుంది ఈ పథకం. ఇచ్చే ఈ డబ్బులు వలంటీర్ల చేతిలో ఉన్నపుడు వారు చెప్పిందల్లా అర్హులు చేసి తీరాల్సిందే. డబ్బులు అక్కౌంట్లో డైరెక్టుగా వేసినా... ఏ అక్కౌంట్లో వేయాలో నిర్ణయించేది వలంటీర్ల వ్యవస్థే. అంటే... ప్రభుత్వ పథకాలను జగన్ పథకాలుగా మార్చే బ్రహ్మాండమైన ఐడియా అన్నమాట ఇది. మరోవైపు తన ప్రత్యర్థులను చేతికి మట్టి అంటకుండా చితికిపోయేలా చేసే కుల వ్యూహం ఇది.

ఇందులో మరోపెద్ద ట్విస్ట్ ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమం కోసం ఇంతకాలం డబ్బులు విడుదల చేసేవారు కాదు. వాటిని దీనికి మళ్లిస్తారట. ఏమైనా అడిగితే... వెర్రివాళ్లారా ఈ పథకం ద్వారా ఖర్చుపెట్టేది వాళ్లకే కదా అంటారు. అంటే ప్రభుత్వాం బడ్జెట్ లో బీసీ సంక్షేమం అని చెబుతుంది. బయటకు వచ్చి విద్యా దీవెన అని చెబుతుంది. రెండు సార్లు పేరొస్తుంది. జనం చేతికి ప్రయోజనం మాత్రం ఒకటే. విద్యా దీవెన, వసతి దీవెన పేర్లు చెప్పి కాలేజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము దాదాపు 927 కోట్లు బీసీ కార్పొరేషన్ నుంచి తరలించిన ఆధారం కింద చిత్రంలో మీరు చూడొచ్చు.