KGF 2 : సౌత్ సినిమాలో మరో సంచలన వార్త

June 03, 2020

కేజీఎఫ్ సినిమా... కన్నడ సినిమా తలరాతను తిరగరాసింది. కన్నడ సినిమా రికార్డుల గురించి చెప్పాలంటే ఆ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అని చెప్పుకోవాలి. చాప్టర్ 1 కలెక్షన్లలో ఇప్పటి దుమ్ముుదులిపిన కేజీఎఫ్ ... చాప్టర్ డిజిటల్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. ఒక సౌత్ సినిమాకు ఈ స్థాయి రేటు రావడం బాగా అరుదు. 

భిన్నమైన కథ, అంతకంటే భిన్నమైన ప్రజెంటేషన్... ప్రపంచం పైపైన మాత్రమే చూసే సబ్జెక్టులో ఒక దారుణమైన యాంగిల్ జొప్పించడం వంటి అనేక కారణాల వల్ల ఆ సినిమా నేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక కన్నడ సినిమా అంతకు ముందు ఎపుడూ ఇంత ఆదరణ పొందలేదు. ఆ క్రెడిట్ KGF కే దక్కింది. 

అయితే, ఆ సినిమా బాగా హిట్ అవడంతో సీక్వెల్ తెరపైకి వచ్చింది. పైగా సీక్వెల్ కు సరిగ్గా సూటయ్యే సబ్జెక్టు కూడా సినిమాలో ఉంది. దీంతో యశ్ హీరోగా పార్ట్ 2 మొదలుపెట్టారు. మిగతా సినిమాలను పార్ట్ 2 అంటాం గాని.. మొదటి సినిమాకు చాప్టర్ 1 అని పెట్టడం వల్ల ఈ సినిమాను కేజీఎఫ్ చాప్టర్ 2 అని పిలుస్తున్నారు.

చాప్టర్ 1 సూపర్ హిట్ కావడంతో ఇందులో తారాగణం భారీగా పెరిగింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు చేరారు. అన్ని భాషలకు మరింతగా కనెక్ట్ చేయడం దీని ఉద్దేశం.  యశ్ కు హీరోయిన్ గా మొదటి సినిమాలో నటించిన శ్రీనిధి షెట్టి యే నటిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక అమెజాన్ 55 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి కొనుక్కుంది.